Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులను ఆదేశించిన జిల్లాల కలెక్టర్లు
- హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ వీడియో కాన్ఫరెన్స్
నవ తెలంగాణ- వనపర్తి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ''తొలిమెట్టు'' కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. తొలిమెట్టు కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర విద్యాశాఖ కార్య దర్శి వాకాటి కరుణ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక దశలో విద్యార్థులకు విద్యా ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయని, 75 శాతం మంది విద్యార్థులకు పూర్తిస్థాయి ప్రమాణాలు లేవన్న అంశం పై అధికారులు శ్రద్ధ వహించాలన్నారు. విద్యా ప్రమా ణాలలో మంచి ఫలితాలు సాధించాలనే లక్ష్యం తో, పిల్లల కనీస ప్రమాణాలపై ప్రత్యేకశ్రద్ద వహించి ''తొలిమెట్టు'' కార్యక్రమం అమలు చేయాలని ఆమె సూచించారు. ప్రాథమిక స్థాయి పిల్లలకు అక్షరాలను గుర్తించడం, చిన్న చిన్న వ్యాసాలు చదవడం, బేసిక్ మాథ్స్ తదితర అంశాలపై పిల్లలను భాగస్వామ్యం చేస్తూ, ఆహ్లాదకరమైన వాతావరణంలో బోధన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. వ్రిద్యా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు ఉపా ధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈ ఈ మల్లయ్య, మండల విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ధరూర్ : జిల్లాలలో ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్ర మాన్ని పటిష్టంగా అమలు చేయా లని రాష్ట్ర విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీమతి వాకటి కరుణ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎఫ్ ఎల్ ఎన్ తొలిమెట్టు కార్యక్రమం ద్వారా ప్రాథమిక పాఠశాలలలో సమూల మార్పులు తీసుకురావడానికి ఉపాధ్యాయులు, పర్యవేక్షణ అధికారులు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీమతి వాకటి కరుణ సూచించారు. జిల్లా కలెక్టర్లు ,జిల్లా విద్యాధికారులు, మండల నోడల్ ఆఫీసర్లు, సెక్టోరియల్ అధికా రులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమము ద్వారా విద్యార్థులలో కనీస సామర్థ్యాలు సాధించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లా డుతూ జిల్లలో ప్రత్యేక కార్యాచరణ కార్య కమాలు ఏర్పరుచుకొని పర్యవేక్షణ పటిష్టంగా జరిగే విదంగా చూడాలని విద్యాదికారులకు ఆదే శించారు. ప్రతి టిచర్ మాడ్యుల్ చదివి సిలబస్ లోనే మంచిగా విద్యార్థులకు బోధించే విదంగ చూస్తా మన్నారు. సమావేశం లో జిల్లా విద్య శాఖ అధికారి సిరాజుద్దీన్, ఈపిఆర్ సమత పాల్గొన్నారు.
కంద నులు: ఒకటి నుండి ఐదవ తరగతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రతి ఒక్కరికి చదవడం రాయడం తో పాటు గణితంలో కనీస పరిజ్ఞానం పెంపొందించేందుకు చేపట్టిన తొలిమెట్టు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ సూచించారు. గురువారం తొలిమెట్టు కార్యక్రమ అమలు పై జూమ్ మీటింగ్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, విద్యా శాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కరోన కారణంగా పాఠశాలలు పనిచేయక చాలా మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారని తెలిపారు. తద్వారా జిల్లా కలెక్టర్లతో పాటు రాష్ట్ర విద్యశాఖ పరిశీలించి తగు సూచనలు జారీ చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. ఉదరు కుమార్, విద్యా శాఖ కమిషనర్ దేవసేన, అదనపు కలెక్టర్ మను చౌదరి, డి.ఈ.ఓ గోవింద రాజులు, ఇఇ పంచాయతి రాజ్ దామోదర్ రావు, సెక్టోరియల్ అధికారులు పాల్గొన్నారు.