Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకే పార్టీలో రెండు వర్గాలుగా నాయకులు కార్యకర్తలు
- అధికార టీఆర్ఎస్ , ప్రతిపక్ష కాంగ్రెస్ లో అదే తీరు
- బీజేపీలో లుకలుకలు
- ప్రజాసమస్యలు అజెండాగా కమ్యూనిస్టు పార్టీలు
జెండాలు ఒకటే ఎజెండా లేని వేరుగా నాయకులు కార్యకర్తలు పనిచేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్ సభను ఇంటిపోరు సాగుతుండగా కాషాయ దళం బీజేపీలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. అచ్చంపేట కల్వకుర్తి నాగర్ కర్నూల్ జడ్చర్ల మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఇంటి లో వర్గ పోరు ఎదుర్కొంటున్న అధికార టీఆర్ఎస్ సైతం ఇంటి పేరుతో తలలు పట్టుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఇదే పరిస్థితి ఉంటే ప్రధాన పార్టీలకు చెందిన నాయకుల గెలుపోటములు ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు ఉన్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.
నవ తెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఏడు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలోనూ ఇద్దరేసి ఆశావహులు ఉన్నారు. దుబ్బాక గ్రేటర్ హైదరాబాద్ లో అధికార పార్టీ ఓటమి చవి చూశా క మౌలికంగా అనేక సంస్కరణలు మొదలుపెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ లో సిటింగ్ వారికే కార్పొరేటర్ అవకాశం కూడా తో అనేక చోట్ల ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అనే విషయాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కార్యకర్తల సమావేశంలో అన్న విషయం గమనార్హం. ఇక వచ్చే ఎన్నికైన సిట్టింగ్ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చే అవకాశాలు లేకపోవడంతో ప్రతి నియోజకవర్గంలోనూ కొత్తగా ఆశావాహులు రంగంలోకి దిగారు. పల్లెనిద్ర అంటూ కొందరు గ్రామాలను చుట్టూ వస్తుంటే పాత నాయకులను కలుసుకుని ఈసారి తమను ఆశీర్వదించాలని కోరుతూ ప్రచారం మొదలు పెట్టారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజీపీ లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొల్లాపూర్ రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి.2018లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి జూపల్లి కష్ణారావు ఓడిపోయారు.కాంగ్రెస్ టికెట్ నుంచి పోటీ చేసిన బీరం హర్షవర్ధన్ రెడ్డి గెలిచారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు కొల్లాపూర్ లో మాజీ మంత్రి జూపల్లి కష్ణారావు తో పాటు రంగినేని అభిలాష రావు ఎన్నికల జీవన్ వాతావరణాన్ని సష్టిస్తున్నారు. అభిలాష్ యాదవ్ టిఆర్ఎస్ లో ఉంటూ కొల్లాపూర్ నియోజక వర్గంలో పల్లెనిద్ర పేరుతో గ్రామ గ్రామాన తిరుగుతూ ఉన్నారు. 32 రాజకీయాల్లో సాగిన జూపల్లి కృష్ణారావును రెండు సంవత్సరాలలోనే అభివృద్ధిలో పయనించిన బీరం హర్షవర్ధన్ రెడ్డి కి ప్రత్యామ్నాయం అభిలాష్ రావును ప్రజలు అభినందిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజక వర్గం నుండి మీరే గెలవాలని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఇక కొల్లాపూర్ లో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు నామమాత్రంగానే ఉన్నాయి. సీపీఐ(ఎం) దాని ప్రతి ప్రజా సమస్యల ఎజెండాగా పని చేస్తున్నాయి.
అచ్చంపేట నియోజకవర్గంలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ అధికార కాకుండా టిఆర్ఎస్లో రెండు కూటములు నాయకులు పనిచేస్తున్నారు.డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వంశీకష్ణ ఆయనకు సమాంతరంగా డిఎస్మాస్ సంస్థను నిర్వహిస్తున్న సతీష్ మాదిగ నియోజకవర్గంలో విస్తతంగా పర్యటిస్తున్నారు.ఒక దశలో వంశీకష్ణ కాంగ్రెస్ను వదిలి బిజెపిలోకి వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. డిఎస్మోసం స్థాపించి అనేకమందికి దళిత సామాజిక వర్గాలకు చెందిన వారికి ఉపాధి కల్పిస్తున్న సతీష్ కుమార్ అపూర్వ ఆదరణ లభిస్తోంది. ప్రతి ఒక్కరిని కలుస్తూ వారి మద్దతు కూడగడుతున్నారు. దీంతో భద్రత కోల్పోయిన వారిలో దాడి చేయడానికి ప్రయత్నించారు. ఇదంతా అచ్చంపేట నియోజకవర్గం ప్రజలు గమనిస్తున్నారు. అధికారులపై మండిపాటు కార్యకర్తలపై చిరాకు ఇలా అనేక అంశాలను చూస్తే గువ్వల బాలరాజు రాజకీయ జీవితం గందరగోళంగా మారింది.బీజీపీ కార్యక్రమాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. నాగర్కర్నూల్ నియోజకవర్గం పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. టిఆర్ఎస్ లో కాంగ్రెస్లో లుకలుకలు పెరుగుతున్నాయి. ఇక కాంగ్రెస్లో మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి మాజీ జెడ్పిటిసి మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. మీరు ఐకమత్యంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇస్తున్నారు. టిఆర్ఎస్ లోనూ రెండు వర్గాలు ఉన్నాయని సమాచారం. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మధ్య పొరపొచ్చాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న వామపక్ష భావజాలం వైపు యువకులు విద్యార్థులు ఆకర్షితులవుతున్నారు. మహబూబ్ నగర్ లో టిఆర్ఎస్ కు ఎదురు లేదన్న ప్రచారం ఉన్నప్పటికీ ఎన్నికలు వస్తే మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు వ్యతిరేకంగా నాయకులు కార్యకర్తలు బయటకు వస్తారని తెలుస్తోంది.ఒంటెత్తు పోకడ అహంకారం వంటి విధానాల వల్ల శ్రీనివాస్ గౌడ్ ఈసారి ప్రజలకు దూరమయ్యే అవకాశాలున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. డిసిసి అధ్యక్షులు జిల్లా కోత్వాల్ జిల్లా నాయకుడు ఎన్ పి వెంకటేష్ సంజీవ్ ముదిరాజ్ ముత్యాల ప్రకాష్ ఇలా అనేక మంది ఉన్నారు. వీరంతా డిసిసి అధ్యక్ష పీఠం కోసం ఎదురు చూస్తున్నారు. జడ్చర్ల వనపర్తి గద్వాల అలంపూర్ నారాయణపేట మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం లోని ఇంటిపోరు బలంగానే పనిచేస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి ఇంటి పోరు లేకుండా చూసుకుంటే తప్ప ప్రధాన పార్టీల నాయకులకు ఓటమి తప్పదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. జెండాలు ఒకటైన ఎజెండాలు నేరుగా తమ పార్టీలోనే పట్టు కోసం నాయకులు పావులు కదుపుతున్నారు. ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఆరోగ్య పరంగా దెబ్బతిన్న వారికి అత్యవసర సమయాల్లో కొంతమందికి ఆర్థికంగా ఆదుకున్నారు.