Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నారాయణపేట టౌన్
జిల్లా కేంద్రంలోని చిన్నపిల్లల ఆస్పత్రిని ఆకస్మికంగా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తనిఖీ చేశారు. ఆస్పత్రిలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. ఆసుపత్రికి కావాల్సిన మౌలిక సదుపాయాలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎన్ఐఎస్యూ, పీఐసీయూ వార్డులను పరిశీలించారు. రోజు ఇన్ పేషెంట్లు ఎంతమంది వైద్యం పొందుతున్నారని తెలిపారు. అదేవిధంగా ఓపీ ఎంతమంది వస్తున్నారని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ అన్నారు. వైద్యం కు వచ్చే వారికి అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తనికి సమయంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంజిత్ కుమార్, డాక్టర్ మల్లికార్జున్, ఆర్ ఎమ్ యు డాక్టర్ వన్నవి, డాక్టర్ క్రాంతి కిరణ్ ,ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు.