Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ జె రంజన్ రతన్ కుమార్
నవతెలంగాణ -ధరూర్
జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం పెండింగ్ కేసులు, ఫంక్షనల్ వర్టికల్‌పై ఎస్పీ జె రంజన్ రతన్ కుమా ర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులలో గ్రేవ్, నాను గ్రేవ్ కేసుల గురించి సీఐలను, ఎస్ఐలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ..ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలి మరియు పూర్తి పారదర్శకంగా కేసులో ఇన్వెస్టిగేషన్ చేయాలి, పెండింగ్ ఉన్న సీసీ నెంబర్లు త్వరగా తీసుకోవాలని సూచించారు. కేసుల్లో కోర్టు ట్రయల్ సమయంలో సాక్షులకు సరైన విధంగా బ్రీఫింగ్ చేసి ప్రవేశ పెట్టడం ద్వారా శిక్షల శాతం పెంచేందుకు కృషి చేయాలన్నా రు. ఫోక్సో ఎస్సీ, ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాన్నారు. కేసున మోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలం కషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలన్నారు. సైబర్ నేరా ల్లో త్వరితగతిన పరిశోధన పూర్తి చేయాలన్నారు. టార్గెట్ పెట్టుకొని పెండింగ్ ఉన్న కేసులను తగ్గించాలన్నారు. దొం గతనాల కేసుల్లో ప్రతిరోజూ కేసు చేదన గురించి అన్ని కోణాల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎస్వోపీ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు ఛేదించాలని సూచించారు. ఈ పెట్టి కేసులు వెంటనే డిస్పోజల్ చేయాలని సూచించారు. ఎన్ఫోర్స్మెంట్ వర్క్‌పై ద్రుష్టి సారించాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజబుల్ పోలీసింగ్‌లో భాగంగా వాహనాల తనిఖీలు ని ర్వహించాలని తెలిపారు. రాత్రి పెట్రోలింగ్ అధికారులు లాడ్జిలు, పాత నేరస్తులను తనిఖీ చేయాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసులు నమో దు చేయాలని సూచించారు. సిసిటిఎన్ఎస్లో డాటా ఎంట్రీ ప్రతిరోజూ మానిటర్ చేయాలని సంబంధిత ఎస్ఐలకు సూచించారు. సీసీ కెమెరాలను ప్రతిరోజూ మానిటర్ చేయాలని పని చెయ్యని సీసీ కెమెరాలను వెంటనే బాగు చేయించాలని సూచించారు. వర్టికల్ వారిగా ఎంట్రీ చేసిన డాటాను నోడల్ అధికారులు ప్రతిరోజూ తనిఖీ చేసుకో వాలని క్వాలిటీ డాటా ఎంట్రీ చేయాలని సూచించారు. మరియు విధినిర్వహణలో రోల్ క్లారిటీ, గోల్ క్లారిటీ ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలని సూచించారు. సైబర్ నేరాల ని యంత్రణ గురించి గ్రామాలలో పట్టణాలలో మరియు ప్రజ లకు ప్రజాప్రతినిధులకు యువకులకు గ్రామాల విపిఓలు, పోలీస్ అధికారులు, సిబ్బంది అవగాహన కార్యక్రమాలు ని ర్వహించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ లను, పోలీస్ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అమల వుతున్న ఇంప్లిమెంటేషన్‌ను నిరంతరాయంగా కొనసాగిం చాలని అందుకు సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలన్నారు.
గ్రూప్ - 1 ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బదీగా బందోబస్తు
ఈ నెల 16న జరుగబోయే గ్రూప్- 1ప్రిలిమినరీ పరీక్ష కు పకడ్బదీగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలి పారు. అందుకు సంబంధించి పోలీస్ అధికారులకు తగు సూచనలు చేశారు. జిల్లా కేంద్రంలోని 15 పరీక్ష కేంద్రాల్లో 4874 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ప్రతి కేంద్రం వద్ద ఉదయం 6 :00 గంటలకు బందోబస్తు ఫోర్స్ ను ఏర్పాటు చేసుకోవాలని, అభ్యర్థులను తనిఖీలు చేసి లోపలికి అనుమతించాలని, ఎలాంటి ఎలక్ట్రానిక్ గా డ్జెట్స్ను అనుమతించకుడదని సూచించారు. ఆ సమ యంలో జిల్లా కేంద్రంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్ లను మూసి వేయించాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ బి. రాములు నాయక్, సాయుద దళ డీఎస్పీ ఇమ్మనియోల్, ఎస్బి ఇన్స్పెక్టర్ శివకుమార్, డీసీ ఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, గద్వాల్, అలంపూ ర్, శాంతినగర్ సీఐలు చంద్రశేఖర్, సూర్యనాయక్ , శివ శంకర్, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, డీసీ ఆర్బీఏ, ఎస్సై దేవరాజు, సిబ్బంది, ఐటీ సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.