Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -మిడ్జిల్
గత 80రోజుల నుంచి పే స్కేల్ అమలు చేయా లని అర్హులైన వారికి ప్రమోషన్లు 53 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల కుటుంబాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్న వీఆర్ ఏలు ప్రభుత్వంతో చర్చలు జరపడంతో గురువారం తాసిల్దార్ రాజీవ్‌రెడ్డి సమక్షంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 31మంది వీఆర్ఏలు విధుల్లో చేరారు. ఈ సందర్భంగా తాసిల్దార్ రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలకు అందుబా టులో ఉండాలని సూచించారు. వీఆర్ఏల న్యాయ మైన డిమాండ్లను ప్రభుత్వం త్వరలో పరిష్కరిస్తుం దని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ రామం జనేయులు, వీఆర్ఏలు శ్రీశైలం, బాలస్వామి, కరు ణాకర్, శ్రీనివాస్ గౌడ్, కాసిం, మల్లేష్, చెన్నయ్య, శివకుమార్, శంకర్, వెంకటమ్మ, బాలమ్మ, లక్ష్మి, కలమ్మ, కళావతి తదితరులు ఉన్నారు
ఆత్మకూరు: గత 80రోజులుగా వీఆర్ఏలు తమ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్న వీఆర్ఏలు రాష్ట్ర జేఏసీ సూచన మేర కు సమ్మె విరమించి విధుల్లో చేరుతున్నట్లు మండల నాయకులు గోవిందు, శ్రీనివా సులు గురువారం ఒక ప్రకటన పేర్కొన్నారు. కార్యక్రమంలో నాగేంద్రం, కే.శ్రీనివా సులు, నయుం, రాము, రంగన్న, రాము లు, మల్లేష్, నాగరాజు, పావని, లక్ష్మీ, చింతలన్న, బాలకిస్టన్న పాల్గొన్నారు
ఉండవల్లి: గత 80రోజుల నుంచి పేస్కేల్ అమలు చేయాలని అర్హులైన వారికి ప్రమోషన్లు 53 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల కుటుంబాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్న వీఆర్ఏలు ప్రభుత్వంతో చర్చలు కావడంతో వీఆర్ఏలు నిరవధిక సమ్మెలో భాగంగా డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి ఫలితంగా గురువారం విధుల్లో చేరినట్లు వీఆర్ఏలు గోవిందు, మద్దిలేటి భాషా తదితరులు తెలిపారు. మనపాడు ఉండవెల్లి గ్రామ రెవెన్యూ సహాయకులు వీధుల్లో పాల్గొన్నారు.
నవతెలంగాణ- ధరూర్
గత 80 రోజుల నుంచి పే స్కేల్ అమ లు చేయాలని అర్హులైన వారికి ప్రమోషన్లు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్న వీఆర్ఏలు ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో వివిధ గ్రామాలకు చెందిన వీఆర్ఏలు గురువారం తాసిల్దార్ సమక్షంలో చేరారు. కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు రాములు, కో-కన్వీనర్లు ఎం వెంకటేశ్వర్లు, కావాలి మహేష్, మండల ప్రధాన కార్యదర్శి గోవ ర్ధన్, వీఆర్ఏలు శ్రీనివాసులు, వీరన్న, మొగులన్న, నరసింహులు, దేవమ్మ, రాములు గరిడి వెంకటేష్, తిమ్మన్న, సవారన్న పాల్గొన్నారు.