Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ వెంకట్రావు
నవతెలంగాణ- హన్వాడ
మండల కేంద్రంలో ప్రభుత్వం చేపట్టిన పనులను నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు. గురు వారం మండలంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఉన్న మార్కెట్ యార్డు ఓపెన్ జిమ్ వెంటనే పూర్తి చేయాలని అన్నారు. మార్కెట్ యార్డు విశాలమైన ప్రదేశం ఉన్నందున సుందరీకరణ చేపట్టాలని, ఉద్యానవన శాఖాధికారులకు ఆదేశాలు రైతు వేదిక వద్ద ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించి వెంటనే పనులు మొదలు పెట్టాలని సూచించా రు. బిల్లుల విషయంలో జాప్యం జరగదని త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. రెండు నెలల్లో పూర్తి చేసి ప్రారంభో త్సవానికి సిద్ధం చేయాలని సూచించారు. మన ఊరు మనబడి ద్వారా గ్రామంలో ఏర్పాటు చేసిన పాఠశాలను పరి శీలించి, పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని అన్నారు. ప్రహరీ గోడ నిర్మాణం విషయంలో తలెత్తిన వివాధాన్ని అక్కడికక్కడే పరిష్కరించారు. పాఠశాలను ప్రారంభోత్సవానికి వెంటనే సిద్ధం చేయాలని సూచించారు. దళిత బంధు పథకం కింద ప్రారంభించిన స్టీల్ సిమెంట్ షాపులను పరిశీలించారు. ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు దళిత బంధు పథకంలో మంజూరైన శారదా శ్రీనివాస్ స్టీల్ సిమెంట్ షాపును సందర్శించారు. దళిత బంధం ద్వారా ప్రారంభించిన యూనిట్ల నుంచి కొనుగోలు చేయాలని ఇంజ నీరింగ్ అధికారులను ఆదేశించారు. రైతు బజార్ స్మశాలమై న ప్రదేశం అందరికన్నా చేపట్టాలని సూచించారు. కార్యక్ర మంలో డీఆర్డీఏపీడీ యాదయ్య, పశుసంవర్ధక శాఖాధికారి మధుసూదన్ గౌడ్, గృహ నిర్మాణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వైద్యం భాస్కర్, పంచాయత్ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరేందర్, డీఈవో రవీందర్, తాసిల్దార్ బక్క శ్రీనివాసులు, ఎంపీడీవో ధనుంజయ గౌడ్, స్థానిక సర్పంచ్ రేవతి సత్యం తదితరులు పాల్గొన్నారు.