Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబ్ నగర్ : దేశంలో ప్రజల ఐక్యతను కోరుతూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్రతో సమూల మార్పులు వస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో జోడోయాత్ర పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ జోడ యాత్ర వల్ల దేశంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునర్జీవం పోసుకుంటుందని వారు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల నుండి ఇచ్చాపురం వరకు దాదాపు 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ తర్వాత పార్టీ పదేళ్ల పాటు తెలంగాణలో పాలించిందని వారు తెలిపారు. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని రాహుల్ గాంధీ యాత్రతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఉమ్మడి మహబూబ్నగర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం ఈనెల 15వ తేదీన మక్తల్ లో నిర్వహిస్తామని దీనికి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాజరవుతారని వారు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మల్లురవి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు ఓబెద్దుల కొత్వాల్ జిల్లా ఉపాధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ పిసిసి కార్యదర్శి ప్రదీప్ గౌడ్ వినోద్ కుమార్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.