Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్య.కా.స.నాయకుల డిమాండ్
నవతెలంగాణ- కల్వకుర్తి
ఉపాధిహామీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్య లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం పట్టణం లోని ఉపాధిహామీ ఏపీడీకి వినతి పత్రం అంద జేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సం ఘం జిల్లా నాయకులు చింత ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ కూలీలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వారి సమ స్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశా రు. ముఖ్యంగా కూలీలకు 214 రోజుల పని కల్పించాలని, రోజు కూలి రూ.600 చెల్లించాలని , పెండింగ్‌లో ఉన్న కూలి డబ్బులను వెంటనే విడు దల చేయాలని డిమాండ్ చేశారు. రెండు సంవ త్సరాల క్రితం ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగించి వారి స్థానంలో సీనియర్ మేట్లను ఫీల్డ్ అసిస్టెంట్‌గా కొన సాగిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆంజనేయుల, వ్యవసాయ కార్మిక సం ఘం మండల నాయకులు బాలస్వామి, రాజు, సిద్ద య్య, శంకర్‌గౌడ్, ప్రభాకర్, మల్లేష్ పాల్గొన్నారు.
' పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలి '
కోడేరు: మండలంలోని ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు తక్షణ మే చెల్లించాలంటూ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాల యం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భం గా వ్యవసాయ కార్మిక సంఘం నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.నరసింహ మాట్లాడుతూ కూలీ లకు చేసిన పనులకు బిల్లులు చెల్లించడంలో అధికా రులు తాత్సారం చేయడం వల్ల కూలీలు ఆర్థికంగా ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తక్షణమే పెండింగ్ బిల్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానికంగా పనులు లేకపోవడం, అధికారులు ఉపా ధి హామీ పథకం పనులు కూడా చూపించక పోవడంతో కూలీలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి క్షేత్రస్థా యిలో పంచాయతీ కార్యదర్శులతో పాటు క్షేత్ర సహాయకుల సహకారం తో పనులను గుర్తించి తక్షణమే కూలీలకు పనులు కల్పించాలని, పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మండలంలో కొత్త పింఛన్లు మంజూరు చేసిన ప్రభుత్వం మళ్లీ దొడ్డి దారిన అరులైన వారి పింఛన్లు కట్ చేయాలని చూస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి పిం ఛన్లు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుచ్చన్న, రాజు, భగవంతు, పర్వతాలు, ఈశ్వరయ్య ,కృష్ణయ్య, కల్వకోలు రాములు ,మరాఠీ వెంకటయ్య, రాజాపూర్ గ్రామ కురుమయ్య, నాగేంద్రం, నరసిం హ, నాగయ్య, కోటేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.