Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు నెలలుగా అందని కూలి డబ్బు
- ఇబ్బందులు పడుతున్న ఉపాధి హామీ కూలీలు
- దసరా పండుగ చేసుకోలేక పోయామని ఆవేదన
కూలి డబ్బులు వస్తే పండుగను ఘనంగా జరుపుకుందామనుకుంటే పస్తులుండాల్సి వచ్చిందని ఉపాధి హామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. చేసిన పనికి వారం వారం కూలి ఇవ్వా ల్సి ఉన్నా రెండు నెలలుగా ఇవ్వక పోవడం తో ఇబ్బందులు పడుతున్నామని, దసరా పండుగకైనా డబ్బులు ఇస్తారనుకుంటే పిల్లలకు కనీసం బట్టలైనా కొనివ్వ లేక పోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నవతెలంగాణ-ఉండవల్లి
మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో పని చేస్తే రెండు నెలల నుంచి ప్రభుత్వం కూలి డబ్బులు చెల్లించక పోవడంతో తమ కుటుంబాలు ఎలా గడు స్తాయని కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలం లోని 16 గ్రామ పంచాయతీలను రోజుకు 200 మంది పైగా కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారని అధికా రుల సమాచారం. వీరు రెండు నెలలుగా ఉపాధి పనులు చేసి నా కూలి డబ్బులు రాక పోవడంతో అప్పు చేసి కుటుంబాలను పోషించాల్సిన పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం దసరా పండుగ కై నా అధికారులు కూలి డబ్బు లు ఇస్తారని ఎదురు చూ స్తే తమకు నిరాశే ఎ దురైంద న్నారు. దసరా పం డుగకు పిల్ల లకు కనీసం కొత్త బట్టలు కూ డా కొనివ్వలేక పో యామని వారు ఆవే దన వ్యక్తం చేశారు. రెక్కాడితేగాని డొక్కాడని తమకు నెలలుగా కూలి డబ్బులు చెల్లించకుంటే తాము ఎలా బతికేదని కూలీలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పట్టికై నా పాల కులు స్పందించి వెంటనే కూలి డబ్బులు చెల్లిం చాలని వారు కోరుతున్నారు.
ఆన్లైన్వల్లే ఆలస్యం
- ఏపీఓ విజరుశంకర్
పెండింగ్ కూలి డబ్బుల గురించి ఏపీఓ విజరుశంకర్ను వివరణ కోరగా కూలీలకు చెల్లించాల్సిన కూలి డబ్బుల వివరాలు ఆన్లైన్లో చూపడం లేదని అందుకే ఆలస్యమైందని తెలిపారు. ఈ విషయం కూలీ లకు కూడా తెలుసన్నారు.
పండుగ చేసుకోలే
రెండు నెలలు పనులు చేసినా కూలి డబ్బులు ఇవ్వక పోవడంతో దసరా పండుగ చేసుకోలేదు. అప్పు చేసి తిండి గింజలు కొనాల్సి వస్తోంది. సారొళ్లు తొందరగా కూలి డబ్బు లు ఇస్తే చేసిన అప్పులై నా తీరుస్తాం.
- విజయన్న , ఉపాధికూలీ