Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నారాయణపేట టౌన్
వార్షిక తనిఖీలలో భాగంగా గురువారం నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ పరిసరాలను పరిశీలించి పోలీసు అధికారులు సిబ్బందితో ముఖాముఖి నిర్వహించారు. పోలీస్ అధికారులు, స్బింది సర్వీస్‌కు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే డిపిఓకు తెలిపి పరిష్కరించుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో పోలీసు అధికారులు సిబ్బంది పోటీపడి విధు లు నిర్వహించాలన్నారు. అంకిత భావంతో విధులు నిర్వహించే వారికి రివార్డు , అవార్డులు ప్రతినెల ఇవ్వనునట్లు ఎస్పీ తెలిపారు. ప్రతి ఒక్కరు జిల్లా పరిధి లో ఉండి విధులు నిర్వహించాలని సమయం దొరికినప్పుడు ఫ్యామిలీతో సం తోషంగా గడపాలని, వచ్చే జీతంతో కొంత పిల్లల భవిష్యత్తు కోసం జమ చేసు కోవాలని సూచించారు. ప్రతి దినం పోలీస్ అధికారులు సిబ్బంది సమయం దొరికినప్పుడు వ్యాయామం, యోగా, వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవా లని సూచించారు. టౌన్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు యొక్క పనితీ రును పరిశీలించాలని, ప్రతిరోజు వాటిని మానిటర్ చేయాలన్నారు. ఎక్కువగా ఎలాంటి కేసులు నమోదౌవుతున్నాయని ఎస్సైలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెండింగ్ కేసుల ఫై˜ౖళ్లను పరిశీలించారు. అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి క్రైమ్ రేట్ తగ్గించాలని ఆదేశించారు. ఎస్పీ వెంట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, ఎస్సై సురేష్ ఉన్నారు.