Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ పి. ఉదయ్‌కుమార్
కల్వకుర్తి టౌన్: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాల్లో మౌళిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కల్వకుర్తి పట్టణంలో ఏర్పాటు చేసిన గ్రూప్-1పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు, వసతులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాగర్‌కర్నూలు జిల్లాలో మొత్తం 20 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అందులో జిల్లా కేంద్రాల్లో తొమ్మిది, కల్వకుర్తిలో 5 కేంద్రాలు, అచ్చంపేట, కొల్లాపూర్‌లో మూడు చొప్పున పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన ఐదు పరీక్ష కేంద్రాల్లో దాదాపు 1700 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారన్నారు. పరీక్షల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుం టున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట కల్వకుర్తి తహసిల్దార్ రామ్‌రెడ్డి, ఎంఈఓ బాసు నాయక్ తదితరులు ఉన్నారు.