Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-కొత్తకోట
తడి చెత్తను.. పొడి చెత్తను వేరువేరుగా చేసి మున్సిపాలిటీకి అప్పజెప్పాలని మున్సిపల్ చైర్మన్ పొగాకు సుఖేషినీ విశ్వేశ్వర్ అన్నారు. శనివారం మున్సిపాలిటీలోని 9, 10వ వార్డులలో తడి చెత్త.. పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సబాధ్యక్షత వహించగా మున్సిపల్ చైర్మన్ పొగాకు సుఖేషినీ విశ్వేశ్వర్ పాల్గొని మాట్లాడుతూ.. తడి చెత్త అంటే మిగిలిన అన్నం, కూరగాయల పొట్టు, పండ్ల పొట్టు, ఆకుకూరల చెత్త, కుళ్లిపోయిన పండ్లు, మిగి లిన కూర, ఊడ్చిన ఆకులుగా ఉంటాయని.. అలాంటి భూమిలో కరిగిపోయే వ్యర్థాలను మున్సిపాలిటీ అందించిన ప్రత్యేక చెత్త బుట్టిలో వేసి వార్డుకు వచ్చిన చెత్త ట్రాక్టర్ సిబ్బందికి అప్ప చెప్పాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఎరుకలి తిరుపతయ్య, కో -ఆప్షన్ సభ్యులు తహేసీన్ వహీద్ అలీ,మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ వెంక టయ్య, మున్సిపల్ ఆర్పిలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.