Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-అమరచింత
గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శికి సీపీఎం మండల నాయకులు బి వెంకటేష్, గ్రామ కార్యదర్శి మహేష్‌కి వినతిపత్రాన్ని అందజేశారు. శనివారం ఈ సందర్భంగా మం డలంలోని కొంకానివాణి పల్లెలోని నెలకొన్న సమస్యలను ప్రభుత్వ అధికారులు పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభు త్వ అధికారులు పూర్తిగా విఫలమైందని వారు విమర్శించారు. కురుమూర్తి జాతర ప్రారంభమవుతుందని జాతరకు వెళ్లే దారిలో రోడ్డుపై నీరు ప్రవహిస్తుందని, జాతరకు వెళ్లే ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు అన్నారు. గతంలో ఇంతకుముందు ప్రభుత్వ అధికారుల దష్టికి అక్కడ బ్రిడ్జి నిర్మించాలని తీసుకువెళ్లిన ఫలితం లేదని వారు వాపోయారు. కురుమూర్తి జాతర సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలికమైన బ్రిడ్జిని నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని వారు అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో మొగిలిన్న, రాము, తరుణ్, నవీన్, మురళి, రాజు, మోహన్ వీరితో పాటు పలువురు పాల్గొన్నారు.