Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీటీయూ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు
- ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ధర్నా
నవ తెలంగాణ-వనపర్తి
పట్టణంలో నివసించే నిరుపేదల అందరికీ డబల్ బెడ్రూములు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు. పట్టణంలోని వివేకానంద విగ్రహం దగ్గర ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వ ర్యంలో శనివారం మూడోరోజు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ వనపర్తిలో నివసించే నిరుపేదలందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నా రు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇళ్ల స్థలం ఉన్నవారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని, దానిని ఇప్పుడు 3 లక్షల రూపాయలు ఇస్తామని అవి కూడా ఇప్పటివ రకు అమలు చేయలేదన్నారు. 2007 సంవత్సరంలో సుమారు 665 మందికి ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చారని, అవి నేటికి అమలు కాలేదన్నారు. ఇప్పటికైనా గతంలో పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిన వారికి డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలన్నారు. నిరు పేదలైన పేదలందరికీ స్థలాలు ఇచ్చి డబల్ బెడ్రూంలు నిర్మించి ఇవ్వాల న్నారు. లేనిపక్షంలో దశలవారీగా ఆందోళనలు చేస్తూ పేద ప్రజలకున్యాయం జరిగే వర కూ పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టౌన్ కార్యదర్శి గోపాలకృష్ణ, డి కురుమయ్య, డి బాల్ రెడ్డి, పరమేశ్వరాచారి, రాబర్ట్, మదన్, గట్టయ్య, కురుమయ్య, నరసింహ, సాలమ్మ, నాగమ్మ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.