Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయ వ్యవస్థకు వనరులన్నీ సమకూరుస్తాం
- హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ దేవరాజు నాగార్జున
- కాలానుగుణంగా న్యాయ వ్యవస్థ మారాలి
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
- జిల్లా ప్రధాన కోర్టు భవనం ప్రారంభోత్సవం
నవ తెలంగాణ-వనపర్తి
సత్వర న్యాయంతోనే ప్రజలకెంతో మేలు చేకూరు తుందని హైకోర్టు న్యాయ మూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఇన్చార్జి న్యాయమూర్తి డాక్టర్ దేవరాజు నాగార్జున అన్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టు భవనం, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల ను హైకోర్టు న్యాయమూ ర్తులు డి.నాగార్జున, సాంబశివరావు నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిలు ముఖ్యఅతిథులుగా హాజరై శనివారం ప్రారంభించారు. అనంత రం ఏర్పాటు చేసిన సభలో జిల్లా ప్రిన్సిపల్ జడ్జి ము జీబ్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన వహించి, ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ డి.నాగార్జున మాట్లాడుతూ.. రాష్ట్రంలో న్యాయపరమైన విభజన జరగాలనే సదుద్దేశంతో మాజీ సీజెఐ జస్టిస్ రమణ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులను ఏర్పాటు చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. గతంలో ఉమ్మడి జిల్లాల పరంగా ఉన్న కోర్టుల్లో చాలా కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయన్నారు. కేసులు పెరగడం, సత్వ ర పరిష్కారం కాకపోవడం, కోర్టుల సంఖ్య తక్కువగా ఉండటం మూలంగా న్యాయపరమైన సమస్యలు వస్తున్నాయని గుర్తించి జస్టిస్ రమణగారి ఆధ్వ ర్యంలో ఈ నిర్ణయాలు జరిగాయన్నారు. అలాగే చాలా కేసు లు 10, 20 సంవత్స రాల పాటు కొనసాగడం మంచిది కాద న్నారు. దీంతో ప్రజలు తీవ్రంగా నష్టపో తారని, వారి సమస్యలకు సత్వరమే పరిష్కారాలు చూపాలన్న సదుద్దేశంతో ఏర్పా టవుతున్న ఈ కోర్టులన్నీ బాగా పని చేసి మంచి గుర్తింపు పొందాలన్నారు. కోర్టు ల్లో వనరుల సమకూర్చేందుకు తాను ఎప్పుడూ ముందుంటానని, కోర్టులో అవసరమున్న ప్రతి సామాగ్రినీ సమకూరుస్తామని, సమస్యలన్నీ పరిష్కరి స్తామని బార్ అసోసియేషన్‌కు హామీ ఇచ్చారు. హైకోర్టు న్యాయమూర్తి సాంబశివరావు నా యుడు మాట్లాడుతూ తాను కూడా వనపర్తిలోనే మొదటి పోస్టింగ్ తీసుకొని పని చేశానన్నారు. ఈ 30 యేళ్లల్లో ఎంతో అభివృద్ధి జరిగింద న్నారు. ప్రతి న్యాయవా ది బాగా కష్టపడాలని, కేసులను పరిష్కరించి ప్రజలకు మేలు చేయాలన్నారు. అందరికీ సాయం చేయడంతో ఎంతో సంతృప్తి కలుగుతుందన్నారు. మంత్రి నిరం జన్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్రం ప్రభుత్వం జిల్లాల విభజ న చేపట్టి ప్రజలకు పరిపాలనా వ్యవహారాలను సరళం చేసిందన్నారు. అలాగే న్యాయ విభజన కూడా జరిగితే ఎంతో మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న మాజీ సీజేఐ జస్టిస్ రమణ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో జిల్లా కోర్టుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. 1984లో అన్ని ఉమ్మడి జిల్లాలకు కలిపి ప్రిన్సిపల్, సివిల్, సెషన్స్ కోర్టులు ఒక్కొక్కటే ఉండేవ న్నారు. ప్రజలకు న్యాయ సేవల అందించ డంలో వనపర్తికి విశిష్ట స్థానం ఉంది. ఉమ్మడి జిల్లాలోనూ ఈ ప్రాంతం న్యాయవాదులే చాలా కీలకంగా వ్యవహరించా రన్నారు. అనేక మంది ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాల కు వెళ్లి, విలువలతో కూడిన సేవలు ప్రముఖపాత్ర పోషించారన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, కక్షిదా రులు, ముద్దాయిలు అందరూ మహబూబ్‌నగర్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. అప్పటి న్యాయశాఖ మంత్రి అయ్యపు రెడ్డి ప్రోత్సాహంతో ఆనాటి ఎమ్మెల్యే బాలకిష్టయ్య ఆధ్వర్యం లో వనపర్తి, గద్వాల ఎమ్మెల్యేకు సమరసింహారెడ్డి ఆధ్వర్యం లో గద్వాలకు సబ్ కోర్టులు ఏర్పాటయ్యాయన్నారు. నిర్వాసి తులందరికీ సబ్‌కోర్టులు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. మరో ఐదేళ్లకు నాగర్‌కర్నూల్‌కు సబ్ కోర్టు వచ్చిందన్నారు. వనపర్తికి సబ్‌కోర్టు రావాలంటే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఉంటేనే వచ్చేదని, 1995లో అప్పటి ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డికి తాను రిప్ర సెంటేటివ్గా ఉంటూ వనపర్తికి గోపాల్పేట, పాన్‌గల్, వీపనగండ్ల మండలాలను కలుపుకొ ని రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాల రీత్యా అవసరాలు పెరుగుతాయని, ఉపాధి అవకాశాలు పెంచ డం, నేరాల స్వభావం మారడం వంటివి ఏర్పడుతున్నాయని, ఆర్థిక పరమైన నేరా లు, సైబర్ నేరాలు, సమాజంలో పెరిగి, సామాన్యుల నేర స్వభావం తగ్గిపోయింద న్నారు. ప్రజలకు న్యాయపరమైన సమాచారం తెలపడం కోసం కోర్టులే నేడు గ్రా మాలకు చేరుకొని అవగాహన కల్పించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జిల్లా కోర్టులు ఉపయోగపడాలని మంత్రి కోరారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తులను మంత్రి నిరంజన్‌రెడ్డి, వనపర్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానిం చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ ప్రధాన న్యాయ మూర్తి డా. నాగార్జున, హై కోర్ట్ న్యాయమూర్తి సాంబశివ నాయుడు, ఉజెబ్ అహ్మద్ ఖాన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్ కుమార్, ఉమ్మడి జిల్లా న్యాయమూర్తులు జయ ప్రసాద్, రజిని, నాగార్జున, మిత్ర, గౌస్ పాషా, రామేశ్వర్ రెడ్డి, మురళి, జెడ్పీ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, ఎస్పీ అపూర్వ రావు, జిల్లా న్యాయమూర్తులు, బార్ అసోసియే షన్ అధ్యక్షుడు భరత్ కుమార్, ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్ సీనియర్ న్యాయవాదులు బక్షి చంద్రశేఖర్ రావు,మోహాన్ కుమార్, రామచంద్రారెడ్డి, దినేష్ రెడ్డి,వెంకటరమణ, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, వనపర్తి మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.