Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ జబ్బర్
నవ తెలంగాణ-వనపర్తి
అమరవీరుల స్ఫూర్తి తో ఉన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండీ జబ్బర్ అన్నారు. ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆఫీసులో జోహార్ మహమ్మద్ అశ్వికుల ఖాన్ 122వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్య్రం రావాలని 29సంవత్సరాల వయ సులో అమరుడయ్యాడని గుర్తు చేశారు. భగత్ సింగ్, రాంప్రసాద్ థిస్మలతో కలిసి బ్రిటి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో మూడు లక్షల 90వేల మంది బలయ్యారని, అందులో 65,000 ముస్లింలు అమరులయ్యారన్నారు. మత ఉన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మునీరుద్దీన్, డివైఎఫ్ఐ నాయకులు మహేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.