Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దిగుబడులు తగ్గడంతో ఆందోళనలో రైతులు
- గ్రామాలల్లో కనపడని దీపావళి సంబరాలు
- దీపావళి విశిష్టత ఏంటి?
- చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు దీపావళి
పండుగ ఎలా వచ్చిందని పక్కన పెడితే పండుగ జరుపుకునే తీరు చూస్తే ప్రకృతితో ముడిపడి ఉందన్న విషయం మనకు తెలుస్తుంది.ముఖ్యంగా పూలు పండ్లు చిరుధాన్యాలతో ఈ ఈ పండుగను అత్యంత ఉత్సాహంగా చేసుకుంటారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు కనబడటం లేదు. గ్రామాలల్లో అంధకారం నెలకొంది.ఏడాది అతివృష్టితో పంటలు 80 శాతం దెబ్బతిన్నాయి.ముఖ్యంగా అరకొర దిగుబడికి సైతం గిట్టుబాటు ధర లేదు. పత్తితో పాటు వేరుశనగ కంది బొప్పాయి వంటి తోటలు భారీగా నష్టపోయాయి.ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో దీపావళి పండుగకు గ్రామీణ రైతంగం దూరంగా ఉంటున్నారు.
నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దీపావళి పండుగను అత్యంత వైభవంగా సంతోషాలతో జరుపుకునేవారు. పండుగ ఎలా వచ్చిందని పక్కన పెడితే పండుగ జరుపుకునే తీరు చూస్తే ప్రకృతితో ముడిపడి ఉందన్న విషయం మనకు తెలుస్తుంది.ముఖ్యంగా పూలు పండ్లు చిరుధాన్యాలతో ఈ ఈ పండుగను అత్యంత ఉత్సాహంగా చేసుకుంటారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు కనబడటం లేదు. గ్రామాలల్లో అంధకారం నెలకొంది.ఏడాది అతివృష్టితో పంటలు 80 శాతం దెబ్బతిన్నాయి.ముఖ్యంగా అరకొర దిగుబడికి సైతం గిట్టుబాటు ధర లేదు. పత్తితో పాటు వేరుశనగ కంది బొప్పాయి వంటి తోటలు భారీగా నష్టపోయాయి.ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో దీపావళి పండుగకు గ్రామీణ రైతంగం దూరంగా ఉంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగుబడులకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా అధిక వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి. అప్పుడే దీపావళి వంటి పండుగలకు రైతులు ఆనందోత్సవాలతో జరుపుకుంటారు.
దీపావళి.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగగా ప్రచారంలో ఉంది. ఇంట్లోకి నూతన వెలుగులు తీసుకొచ్చే మహత్తర పండుగ అయినా ఈ ఏడాది ప్రజలలో వెలుగులు నింపడం లేదు. అందిర ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినం రోజు ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆశ్వయుజ బహుళ అమవాస్య రోజు ఈ పండుగ వస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 24 సోమవారం వచ్చింది. అయితే అసలు ఈ పండుగ విశిష్టత ఏంటి? పౌరాణిక చరిత్ర ఉందా? లాంటి ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.
దీపావళి ఎందుకు చేసుకుంటారు ?
రామాయణంలోనూ దీపావళి ప్రస్తావన ఉంది. పురాణ కథనం ప్రకారం.. ఎన్ని కథలు ఉన్నా ప్రజలు తమ వ్యవసాయ రంగం పంటలు దిగుబడులు తదితర వాటితో పాటు పూలు పండ్ల తెచ్చి గౌరవిస్తారు. పురాణాలలో ఎన్ని కథలు ఉన్నా ప్కతి మానవునికి ఇచ్చిన వరప్రసాదంలో భాగమే ఈ వెలుగులని అందుకే ఈ పండుగ రోజు సంతోషాలతో టపాకాయలు వీధి దీపాలు వెలిగిస్తారు. అయితే ఆధ్యాత్మిక గురువులు చెప్పేది మరల ఉంటది. భూదేవి, వరహా స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు.. శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో లోకకంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టిపీడించాడు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేశాడు. నరకాసుర సంహారంతో అందరూ అనందంగా పండుగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకుడి మరణించగా, ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు.