Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉండవల్లి : తెలంగాణ రాష్ట్రంలో దళితులు అన్ని రంగాల్లో అభివద్ధి కావాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు యొక్క ఆశయమని అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. శనివారం ఉండవెల్లి మండల కేంద్రంలోని పి సంధ్యారాణి ఈ దళిత బంధువు కింద గార్మెంట్ షాపును ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రపంచంలో ఏ రాష్ట్రం చేయని పథకం దళిత బంధు అని వారన్నారు రాష్ట్రవ్యాప్తంగా దళితులు అందరికీ ఈ పథకాన్ని అందజేయాలని ఉద్దేశంతోనే విడతలవారీగా ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం ప్రతి ఒక్కరికి ఎదగాలన్న ఉద్దేశంతోనే ప్రవేశపెట్టిందని వారు తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలని వారు కోరారు కష్టపడి పని చేసి సమాజానికి ఆదర్శంగా నిలవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ యువజన నాయకులు వి ఎం అజయ్. జోగులాంబ దేవాలయం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వైసీపీ ఎంపీ దేవన్న సర్పంచ్ సురేఖ గౌడ్ ఎంపీటీసీ సుంకన్న రాజు ఉన్నారు.