Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు
నవతెలంగాణ- కందనూలు
జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యా ర్థిని మృతికి కారణమైన అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీని వాసరావును ఉద్యోగం నుంచి తొలగించి కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం. తారా సింగ్ డిమాండ్ చేశారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ శ్రీనివాసరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు కుటుం బంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు రవితేజ, నాయకులు శివ, ఆనంద్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
అచ్చంపేట: డిగ్రీ విద్యార్థిని చావుకు కారణ మైన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను అరెస్టు చేసి , కఠినం గా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎండి సయ్యద్ డిమాండ్ చేశారు. శనివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరా డుతామన్నారు. మహిళల పట్ల రోజు రోజు రోజుకు అత్యాచారాలు పెరుగుతున్నాయన్నారు. మహిళల రక్షణ చట్టాలు ఉన్నా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. మహి ళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయని డిమాం డ్ చేశారు. విద్యార్థిని కుటుంబానికి న్యా యం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలోఎస్ఎప్ఐ నాయకులు, పాల్గొన్నారు.