Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్య నాయక్
నవతెలంగాణ-పానగల్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోడు భూములు సాగు చేస్తున్న వారి వద్ద నుంచి ఎనిమిది నెలల క్రితం దరఖాస్తులు స్వీకరించారని, అట్టి భూమికి సర్వేలు చేసి కు లాలకు అతీతంగా హక్కు పత్రాలు ఇవ్వాలని గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్య నాయక్ అన్నారు. మంగళవారం పోడు భూముల రైతుల సమస్యలను తెలుసుకోవడా నికి కిష్టాపూర్, మధురపల్లి గ్రామలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతుకు రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ అధికారులు బౌండరీలు ఏర్పాటు చేసి హక్కు పత్రాలు ఇచ్చేటట్లు వెంటనే సర్వేలు చేయించాలని, ఎస్సీ, ఎస్టీ బీసీలందరికి కూడా హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదల భూములను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నుంచి లాక్కొని పెట్టుబడిదారులకు కట్టబట్టేందుకు ప్రయత్నం చేస్తున్న పాలకులకు గ్రామాలలో రైతులు తిరగబడాలని వారు అన్నారు. రైతులందరికీ హక్కు పత్రాలు ఇచ్చేవరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు.