Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూర్యగ్రహణం సమయంలో భోజనాలు
నవతెలంగాణ-పెబ్బేరు
పాతకాలంలో సృష్టించబడ్డ మూఢనమ్మకాలను ప్రజలు నమ్మొద్దని శాస్త్ర సాంకేతిక పద్ధతులు పాటించాలని భారత నాస్తిక సంఘం సభ్యులు జక్కుల వెం కటయ్య తెలిపారు. మంగళవారం సూర్యగ్ర హణం సందర్భంగా ప్రజలకు ఆహారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటికీ మూఢన మ్మకాలని గట్టిగా విశ్వసిస్తూ మనతోపాటు మన పిల్లల భవిష్యత్తును పాడు చెయ్యొద్దని తెలిపారు. సూర్యగ్రహణం ఉన్నప్పుడు భోజనం చెయ్యొద్దని గర్భిణులు బయటికి రావొద్దు అంటూ నీళ్లు తాగొద్దంటూ చెబుతూ ప్రచారం చేయడం సరైందికాదన్నారు. చంద్రం మండలం పైకి రాకెట్లు ప్రయోగించడం మనుషులను పంపించి నివాసం ఉంటున్న ఈ రోజులలో ఇలాంటి మూఢనమ్మకాలు మన అభి వద్ధికి ఆటంకంగా ఉంటాయన్నారు. అందుకే శాస్త్రీయ పద్ధతిలో సూర్యగ్రహణం సమయంలో ఆహారాన్ని ప్రజలకు అందించి మేము తిన్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో భారత నాస్తిక సంఘం సభ్యులు జక్కుల వెంకటయ్య, క్రాంతి కిషోర్, అనిత లోక్ వరుణ్ పాల్గొన్నారు.
నవతెలంగాణ- పానగల్
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం సూర్యగ్రహణాన్ని సోలార్ ఫిల్టర్ సాయంతో వీక్షించారు. ఈ సందర్భంగా జెవివి మండల ప్రధాన కార్యద ర్శి రవికుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు యువత, గ్రామస్తులు ఎంతో ఆసక్తితో సూర్యగ్రహణాన్ని వీక్షించారు. గ్రహణం ఏర్పడినప్పుడు ఆహారం తినకూడదని, గర్భిణులు బయటకు వెళ్లకూడదనే అపోహలు నమ్మరాదని, గ్రహణం మీద ఉన్న అపోహలు తొలగిస్తూ, సూర్యుడు చంద్రుడు భూమి ఒకే వరుసలో రావడం వలన గ్రహణాలు ఏర్పడతాయని అంతే తప్ప రాహు కేతువుల వలన కాదని తెలి పారు. కార్యక్రమంలో జెవివి మండల ఉపాధ్యక్షుడు మహేష్, కార్యదర్శి ఆకాష్, జెవివి సభ్యులు వీరస్వామి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.