Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
నవ తెలంగాణ-కొత్తకోట
బాధితులకు అండగా సీఎం సహాయనిధి ఉందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి కొత్తకోట మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. పాలెం గ్రామానికి 24వేలు, ముమ్మల పల్లి గ్రామానికి 60 వేలు, రామనంతపురం గ్రామానికి 60 వేలు, కనిమెట్ట గ్రామా నికి రూ.1 లక్ష రూపాయల చెక్కులు మంజూరైయ్యాయని వాటిని లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు. ఇది వరకు సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఎవరికి తెలిసేది కాదని అవి అప్పట్లో మంత్రి, ఎమ్మెల్యే కుటుంబాలకే వచ్చేవని అన్నారు. ఇప్పుడు ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి అందుతుందని పేర్కొన్నారు. ఇప్పటికి నా నియోజకవర్గంలో దాదాపు కోట్ల రూపాయలు కేవలం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశామని తెలిపారు. అలాగే అలాగే హాస్పిటల్లో ఉండి ఆపరేషన్‌కు చేసుకోవడానికి డబ్బులు లేని కుటుంబాలకు కూడా ఎల్వోసీ ద్వారా సాయం అందుతుందని అన్నారు. పార్టీల కతీతంగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పొగాకు సుఖేసిని విశ్వేశ్వర్, ఎంపీపీ గుంత మౌనిక, మున్సిపల్ వైస్ చైర్మన్ జయమ్మ, కౌన్సిలర్లు ఖజమైనోద్దీన్, చింతలపల్లి రవీందర్ రెడ్డి, పద్మ అయ్యన్న, తిరుపతయ్య, రామ్మోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ వడ్డే శ్రీనివాసులు, జిల్లా అధికార ప్రతినిధి గాడిల ప్రశాంత్, పట్టణ అధ్యక్షుడు బాబు రెడ్డి, నాయకులు సుభాష్, వినోద్, వహీద్, పెంటన్న యాదవ్, గులాబీ గోవింద్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
శ్రీరంగాపూర్ : మంత్రి క్యాంప్ ఆఫీసులోని సోమవారం సీఎం సహాయనిధి చెక్కులను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పంపిణీ చేశారు. శ్రీరంగాపూర్‌కి చెం దిన శాంతమ్మకు రూ. 30,000, ఎల్లయ్యకు రూ. 8000, వెంకటేశ్వర్లు, రా జశేఖ ర్కు రూ. 40000, కంబాలాపురం, పసుల పెంటమ్మకు రూ. 60000, నవీన్‌కు రూ. 60000, బాలయ్యకు రూ. 12000, జయ్యమ్మకు రూ.13500 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల రైతు సమ న్వయ సమితి అధ్యక్షుడు గౌడ్ నాయక్, టీిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వెంకట స్వామి, మహేష్ గౌడ్, కుర్మయ్య, సూర్య పాల్గొన్నారు
ఆత్మకూరు: మండలంలోని గుంటిపల్లి గ్రామానికి చెందిన మునెన్న అనారోగ్యాని కి గురికావడంతో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 1 లక్ష ఇరవై వేల చెక్కును మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆదేశాలమేరకు మండల బీఆర్ఎస్ నాయకులు రవికుమార్ యాదవ్ వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీిఆర్‌ఎస్ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.