Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండ్లపక్కల మురికికుంట
- ఎన్ని సార్లు వినవించిన పట్టించుకొని పాలకులు
- సీసీ రోడ్డు వేయించాలి : కాలనీవాసులు
నవతెలంగాణ- శ్రీరంగాపూర్
ఇండ్లపక్కల మురికి గుంతలు తొలగించండి ఎంత చెప్పినా పట్టించుకోని గ్రామపంచాయతీ అధికారులు మండల కేంద్రంలోని మూడో వార్డులో రైతు చికెన్ సెంటర్ పక్కలో ఆగిన మురికి నీరును తొలగించాలని మూడో వార్డు కాలనీవాసులు తెలిపారు. అదేవిధంగా ఎస్సీ కమిటీ హల్ భాగం నుండి వెంకటాపూర్ రోడ్డు వెంకట స్వామి ఇంటి ముందు వరకు సీసీ రోడ్డు వేయించాలని కాలనీవాసులు కోరారు. రాత్రి పూట నడువడం ఇబ్బందిగా ఉందన్నారు. అంతేకాక నీరు రోడ్డుమీద పారడం ద్వారా ఆ రోడ్డుమీద వెళ్లే కాలనీవాసులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి వీలైనంత త్వరగా సీసీ రోడ్డు వేయించి కోరారు. అదేవిధంగా మురికికుంటను తొలగించాలి, కొన్ని నెలల కిందట వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు వేయిస్తామని అంబేద్కర్ యువజన సంఘం దగ్గర శిలాఫలకానికి రిబ్బన్ కటింగ్ చేశారు. కానీ ఇప్పటివరకు కూడా అ హమీని అమలు చేయలేదని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి ప్రజా ప్రతినిధులు కాలనీలో మురుకికంపును తోలగించి, సీసీరోడ్డు చేయాలని కోరారు.
మురికికుంటను తొలగించాలి
మురికి కుంటను తొలగించాలి. కొన్ని నెలల కిందట వ్యవ సాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు వేయిస్తామని చేప్పారు. ఇప్పటి వరకు ఎక్కడ వెసిన గోంగడి అక్కడే ఉన్నట్టు సమస్య ఉంది. మురికి కుంటను తొలగించి, సీసీ రోడ్డు వేయాలి.
- దీలిఫ్, గ్రామస్తుడు శ్రీరంగాపూర్