Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ మహబూబ్ నగర్
పాతకాలంలో సృష్టించబడ్డ మూఢనమ్మకాలను ప్రజలు నమ్మొద్దని శాస్త్ర సాంకేతిక పద్ధతులు పాటిం చాలని జనవిజ్ఞాన వేదిక నాయకులు తెలిపారు. మంగళవారం సూర్యగ్రహణం సందర్భంగా తెలంగాణ చౌరస్తా దగ్గర భోజనం ఏర్పాట్లు చేసి ప్రజలకు ఆహారం అందించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక నాయకులు మాట్లాడుతూ నేటికీ మూఢనమ్మకాలని గట్టిగా విశ్వసిస్తూ మనతోపాటు మన పిల్లల భవిష్యత్తును పాడు చెయ్యొద్దని తెలిపారు. సూర్యగ్రహణం ఉన్నప్పుడు భోజనం చెయ్యొద్దని గర్భిణీ స్త్రీలు బయటికి రావొద్దు అంటూ నీళ్లు తాగొద్దంటూ చెబుతూ ప్రచారం చేయడం సరైనది కాదన్నారు. చంద్రం మండలం పైకి రాకెట్లు ప్రయోగించడం మనుషులను పంపించి నివాసం ఉంటున్న ఈ రోజులలో ఇలాంటి మూఢనమ్మకాలు మన అభివృద్ధికి ఆటంకం గా ఉంటాయని వారు అన్నారు. అందుకే శాస్త్రీయ పద్ధతిలో సూర్యగ్రహణం సమయంలో ఆహారాన్ని ప్రజలకు అందించి మేము తిన్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనవిని జ్ఞాన వేదిక నాయకులు వీ కురుమూర్తి వెంకటయ్య పద్మ ,సుశీల, భాస్కర్ రెడ్డి ,కే గోపాల్ తదితరులు పాల్గొన్నారు.