Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జ్యోతిష్యుల మాటలు నమ్మి ప్రజలు దిపావళికి దూరం
- పూల కార్మికులు బతుకులు దారుణం
- మూఢనమ్మకాలను నమొద్దు :నాగర్ కర్నూల్
జిల్లా జన విజ్ఞాన వేదిక కార్యదర్శి రామకృష్ణ
- మూఢనమ్మకాల పట్ల మేధావులు ఆలోచించాలి
పూల వ్యాపారులకు గ్రహణం పట్టింది. జిల్లాలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని చెప్పిన పాలకుల మాటలు నమ్మి రైతులు పూల తోటలను సాగు చేశారు.ఎక్కువగా బంతిపూలను దీపావళి, దసరా పండుగలకు ఉపయోగిస్తారు.ఏడాది దీపావళి అమావాస్య రావడంతో సూర్యగ్రహణం ఉందని చెప్పడంతో జిల్లా ప్రజలు పండుగకు దూరంగా ఉంటున్నారు.
నవ తెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
మూఢనమ్మకాల వల్ల పండ్లకు దూరంగా ఉండటంతో పూలతోటలను సాగు చేసిన రైతులు వ్యాపారులు విలవిలలాడుతున్నారు. ఒక ఏడాది కిలో రూ. 250 ఉండగా ఈ ఏడాది రూ.25 తగ్గింది. దీంతో ఎవరు కొనుగోలు చేయడం లేదు. దీంతో పూల వ్యాపారులు నష్టాల్లో ఉన్నారు. ఏడాది దీపావళి పండుగ సూర్యగ్రహణం పట్టింది. శాస్త్రీయంగా చూస్తే భూమి సూర్యుని మధ్యల చంద్రుడు ఒకే కక్ష మీదికి రావడంతో సూర్యగ్రహణం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. కొన్ని పద్ధతులు పాటిస్తే అన్ని గ్రహణం ఉన్న ఎటువంటి ప్రమాదం లేదని నిపుణులు. చెబుతున్నారు. అయితే దీపావళి పండుగ గ్రహణం వస్తుండడంతో ఈ పండుగ ఎవరు జరుపాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.దీంతో దీపావళికి, నోములు జరపడానికి ప్రజలు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా ఈపండుగకు బంతిపూలతో లక్ష్మీ దేవిని అలంకరించి పండుగలు జరుపుకుంటారు. ఈ పండుగను గ్రహణం సమయంలో జరుపుకో రాదని తెలియడంతో పూలను ఎవరు కొనుగోలు చేయడం లేదు. గత ఏడాది కిలో 250 రూపాయలు ఉంటే ఈసారి కిలో 25 రూపాయలకు పడిపోయింది. తక్కువ ధరకు ఇచ్చిన పూలను కొనుగోలు చేసేవారు కరువయ్యారు. ప్రత్యేకంగా ఈ పండుగల కోసమే రైతులు పూల తోటలను సాగు చేస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2005లో ఈ తోటలను సాగు చేశారు. ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చిన ధర లేకపోవడంతో రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. ముఖ్యంగా బంతిపూల సాగు చేస్తే 15వేలకు పైగా ఖర్చు అవుతుంది. ధర లేకపోవడంతో అప్పు తీరే దారి లేకుండా పోయింది.
పెరిగిపోతున్న మూఢనమ్మకాలు
మనిషి రాతి యుగం నుండి రాకెట్ యుగానికి వచ్చిన నేటికీ మూఢనమ్మకాలను వదలడం లేదు. గ్రహణాన్ని నేరుగా చూస్తే ఇబ్బంది కలిగినప్పటికీ శాస్త్రీయంగా పరోక్షంగా చూడవచ్చు. సూర్యున్ని రాహువు కేతువు మింగేస్తారనడం అవస్తవం. గ్రహణం సమయంలో ఎటువంటి పనులు చేయరాదనం కూడా సరికాదు. కాలి తప్ప వేటకు రావద్దని చెప్పడం మూర?త్వం. గ్రహణం కంటే ముందే భోజనం చేయాలని గ్రహణం సమయంలో ఆహారం విష తుల్యమవుతుందని చెప్పడం కూడా శుద్ధ అబద్ధం. గర్భిణీలు ఎటువంటి పని చేయరాదని ముఖ్యంగా కూరగాయలు కోయరాదని భోజనం చేయరాదని ప్రచారంలో ఉండడం మూరత్వమే. గ్రహణ సమయంలో తులసి ఆకులపై నీళ్లు చల్లాలని చెప్పడం కూడా మూరత్వమే.
జ్యోతిష్యులు కొంపముంచారు
సూర్యగ్రహణం ఏర్పడుతుందని సంవత్సరం ముందే తెలుసు. దీపావళి పండుగ రోజు ఏర్పడే ఈ గ్రహణం ముందే తెలియజేస్తే రైతులు పూలతోటలను సాగు చేసేవారు కాదు. విషయంలో ప్రజలను చైతన్యపరిచే విధంగా ప్రభుత్వాలు పనిచేయడం లేదు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉంది. ఏడాది గ్రహణం వల్ల పూజలు చేయకూడదని అలా చేస్తే అనర్థాలు ఏర్పడతాయని చెబుతున్నారు. పండితులు జ్యోతిష్యులు ప్రజల బలహీనతలను ఆసరా చేసుకొని ఇటువంటి నిబంధనలు చెబుతున్నారు. దీపావళి పండుగ రోజు అత్యధికంగా బంతిపూలను వాడుతారు. పూలతోపాటు పసుపు కుంకుమ అక్షింతలు అగర్బత్తీలు కర్పూరం మట్టి దీపం వంటివి కొనుగోలు చేస్తారు. ఇవి కూడా మార్కెట్లో అమ్ముడుపోవడం లేదు. సూర్యగ్రహణ సమయంలో రాహువు కేతు అనే రాక్షసులు సూర్యుణ్ణి మింగేస్తాయనే అపోలు కల్పిస్తున్నారు.
ప్రభుత్వం, మేధావులు ప్రజలను చైతన్యవంతం చేయాలి
జిల్లాలో అనేక రకాలైన మూఢనమ్మకాలు ఉన్నాయి. మూఢనమ్మకాల వల్ల శాస్త్రీయ దృక్పథం కొరవడుతోంది. నిత్య జీవితంలో మూఢనమ్మకాలే పంపాను చేస్తున్నాయి. ముఖ్యంగా చంద్రగ్రహణం సూర్యగ్రహం ఏదైనా ఒకే కక్ష పైకి మూడు గ్రహాలు వచ్చినప్పుడు ఏర్పడతాయి. దీనిని కొంతమంది రాహువు కేతువులు అనే గ్రహాలు సూర్యుని మింగుతాయని చెప్పడం అవివేకమే. సూర్యగ్రహణం సమయంలో పనులు చేయరాదనడం దర్బనీలు కూరగాయలు కోయరాదని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పటికైనా అధికారులు మేధావులు శాస్త్రీయ దక్పథం కలిగిన వారు గ్రహణం విషయంలో వాస్తవాలు చెప్పాలి. లేనిచో మనం తిరోగమనమే అవుతుంది.
- రామకృష్ణ ,జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి నాగర్ కర్నూల్