Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విగ్రహావిష్కరణలో ప్రజాగాయకుడు గద్దర్
నవతెలంగాణ-పెద్దకొత్తపల్లి
తెలంగాణలో తొలి భూ పోరాటానికి నాంది పలికిన ఉద్యమకారిణి వీరవనిత చాకలి ఐలమ్మ అన్ని, ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ప్రజా యుద్ధ నౌక గద్దర్, పీసీసీ సభ్యులు చింతలపల్లి జయదీశ్వర్రావు అన్నా రు. మండల కేంద్రంలో మండల రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐల మ్మ విగ్రహాన్ని మంగళవారం వారు జెడ్పిటిసి సభ్యు రాలు మేకల గౌరమ్మ చంద్రయ్య యాదవ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆనాటి కమ్యూనిస్టులతో కలిసి భూమి కోసం, భుక్తి కోసం, రోకలి పట్టి నైజాం ప్రభుత్వాన్ని ఎదురించిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. అనం తరం ఐలమ్మ కుటుంబ వారసులను పెద్దకొత్తపల్లి సర్పంచ్ ఆదేర్ల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ దండు నరసింహ తదితరులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేల్ల ఆశయ. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, రైతు సమన్వయ సమితి అధ్యక్షు డు పిల్లిగుంట నాగరాజు, ఉప సర్పంచ్ నిమ్మల మషన్న, జిల్లా రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షు డు షాలీశ్వర్, మండల రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు ఇంద్రకంటి అలీ అక్బర్, మండల రజక సంఘం ఉపాధ్యక్షుడు ఇంద్రకంటి బాలస్వామి, మాజీ సర్పంచ్ జక్కుల నరసింహ, ఉప సర్పంచ్ మషన్న, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ పాలెం నరసింహ, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు తుపాకుల వెంకటేష్, బుడగ జంగాల రాష్ట్ర అధ్యక్షు డు కృష్ణయ్య ,సవరాజు శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, పెద్దకొత్తపల్లి మండల రజక వృత్తిదారుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.