Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్వానంగా మారిన రోడ్డు
- పట్టించుకోని అధికారులు
- స్పందించని ప్రజా ప్రతినిధులు
- ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
అసలే గతుకుల రోడ్డు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అదికాస్తా గోతులమయంగా మారింది.. దీంతో ఆరోడ్డుపై ప్రయాణించాలంటేనే ద్విచక్రవాహన దారులు జంకుతు న్నారు.. అధ్వానంగా మారిన రోడ్డుపై వాహనాలు అదుపు తప్పి పడిపోతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేసు న్నారు. ఈ రోడ్డుపై కాలినడకకు సైతం ఇబ్బందులు పడు తున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నవతెలంగాణ - కల్వకుర్తి
మండలంలోని తుర్కలపల్లి నుంచి ఎల్లికట్ట వరకు బీటీ రోడ్డు గుంతల మయంగా మారడంతో తీవ్ర ఇబ్బం దులు పడుతున్నామని ప్రయాణికులు వాపోతు న్నారు. అధ్వానంగా ఉన్న రోడ్డుపై ఎలాగో ప్రయా ణించేవారమని కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అదికాస్తా పెద్ద పెద్ద గోతులుగా మారడంతో ద్విచక్రవాహనాలు, ఆటోలు అదుపుతప్పి పడిపోతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుర్కలపల్లి నుంచి వేపూరు, తోటపల్లి, ఎల్లికట్ట, మాదారం క్రాస్ రోడ్ వరకు బీటీ రోడ్డు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బీటీ లేచి పెద్ద పెద్ద గోతు లుగా ఏర్పడడంతో రాక పోకలకు తీవ్ర ఇబ్బందులు పడు తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదంటున్నా రు. రోడ్డు మరమ్మతు చేయించాలని స్థానిక ప్రజా ప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవ డం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. రోడ్డు మరమ్మ తులు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినా అధికారులు, ప్రజాప్రతినిధు లు పట్టించు కోలేదంటున్నారు. అప్పుడే మరమ్మతు చేసి ఉంటే రోడ్డు గోతులమయంగా మారేది కాదని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పం దించి రోడ్డు మరమ్మతు చేపట్టి ప్రమాదాల బారిన పడకుం డా చూడాలని వారు కోరుతున్నారు.
వెంటనే మరమ్మతు చేపట్టాలి
తుర్కలపల్లి నుంచి ఎల్లికట్ట వరకు రోడ్డు పూర్తిగా దెబ్బతింది. ఆ రోడ్డుపై ప్రయాణించాలంటే వాహ నదారులు ఇబ్బందులు పడుతున్నా రు. రోడ్డు మరమ్మతులు చేపట్టాలని గతంలో ఆందోళన చేపట్టి స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు అధికారు లకు విన్నవించినా వారు స్పందించ లేదు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మ తుచేపట్టాలి.
-అనిల్,కాంగ్రెస్ యువజన విభాగం నాయకులు