Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ విస్తీర్ణ అధికారి మల్లేష్
అమరచింత:మండలంలోని నందిమల్ల ఎక్స్ రోడ్డు, మిట్ట నందిమల్ల గ్రామా ల్లోని మంగళవారం వ్యవసాయ పంట పొలాలను వ్యవసాయ విస్తరణ అధికా రి మల్లేశ్ పరిశీలించారు. రైతులు వేసు కునే పంటలపై అవగాహన కల్పిస్తూ ఆయన మాట్లాడారు.. ప్రసూతి తరు ణంలో వరి పంటకు దుబ్బ దశ నుంచి చిరు పొట్ట దశలో ఉంది మారుతు న్న ఉష్ణోగ్రతలు అనుకోకుండా కురుస్తున్న వర్షాలతో వరి పంటలకు చీడపీడలు ఆశించే అవకాశం ఉందన్నారు. వాటిలో అగ్గితెగులు, మానీ పండు,( కాటుక) తెగలు, కాండం తొలుచు పురుగు వంటివి చాలా ఎక్కువగా ఆశించే అవకాశం ఉందన్నారు. అగ్గి తెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాముల1 లీటర్ నీటి లేదా ఇస్రోప్రోతి యోలిన్1.5 మిల్లీలీ టర్కు వన్ లీటర్ నీటిని కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. పొడ తెగులు నివారణకు హేకోమో జోల్ 2 మిల్లీలీటర్‌కు ఒక లీటర్ నీటిని కలిపి పిచికారి చేసుకోవాలన్నారు. చివరిగా మాని పండు తెగలుకు నివారణ రైతులు ఒక గ్రామ్ కార్బండైజమ్ లేదా డైతేన్ మిల్లీలీటర్ 45 లీటర్లకు నీటిని కలిపి పిచికారి చేసుకోవాలన్నారు. వరి పంట లు పండించే రైతులకు పలు సూచనలు సలహాలు పంట విధానంపై అవగా హన కల్పించారు.ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు చుక్క ఆసిరెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు.