Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాఘవ
నవతెలంగాణ- అమరచింత
విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు ఎస్ఎఫ్ఐ రాజీలేని పోరాటాలు చేస్తుందని ఎస్ ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాఘవ అన్నారు. మండలంలోని ఆంజనేయులు నగర్ కాలనీలో సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభ్యత్వ కార్యక్రమానికి యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభ్యత్వాలు చేస్తున్నారన్నారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని అందుకో సమే యువకులు, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభ్యత్వలను చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కరించేందుకు యువత ముందుకు వచ్చి ఎస్ఎఫ్ఐలో సభ్యత్వాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అప్పు రమేష్, చింటూ, శ్రీ హరి, వినరు, అబి విద్యార్థులు పాల్గొన్నారు.