Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పారదర్శకంగా అవార్డులో ఎంపిక చేయనున్న కేంద్రం
- మంత్రుల రికమండులకు చెక్
- ఈనెల 31 వరకు ఆన్లైన్ వివరాలు.
- గంట గంటకు మారుతున్న ఫార్మాట్ తో ఇబ్బందులు పడుతున్న కార్యదర్శులు
నవ తెలంగాణ- మహబూబ్ నగర్
మన రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో సంస్థలు వ్యక్తులు యొక్క ప్రతిభను గుర్తించి అవార్డుల ఎంపిక వివిధ పద్ధతిలో ఉండడం సహజం. ఎక్కువగా రికమండుల ద్వారా అవార్డులు వస్తున్నాయని ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీలకు ఉత్తమ అవార్డుల ఇచ్చే విషయంలో కొత్త పద్ధతి ఏడాది నుంచి అమలులోకి తీసుకు వచ్చింది. గత ఏడాది వరకు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రుల ద్వారా రికమండు చేసిన గ్రామపంచాయతీలకు మాత్రమే ఉత్తమ అవార్డులు వచ్చేవి. ఈ ఏడాది ఆన్లైన్ కేంద్రం ప్రభుత్వం సూచించిన 9 కేటగిరీలలో వివరాలను పంపించే పనిలో జిల్లా అధికారులు ఉన్నారు.
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఏప్రిల్ 24 సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఉత్తమ గ్రామపంచాయతీలకు ఇచ్చే అవార్డుల కోసం మహబూబ్ నగర్ జిల్లా అధికార యంత్రాంగ గత నెల సెప్టెంబర్ నుండి పంచా రాజ్ శాఖతోపాటు గ్రామాలకు అనుబంధంగా ఉన్న అన్ని శాఖలను వివరాలు సేకరించే పనిలో నిమగమై ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో 17 మండలాలు 444 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇటీవల కేంద్ర బందం రాష్ట్రాన్ని సందర్శించి మొత్తం వివరాలు ఆన్లైన్ ఉండాలని ఆదేశించడంతో అధికారులు అదే పనిలో ఉన్నారు. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులు మొదలుకొని జిల్లా అధికారి వరకు రెండు దఫాలుగా శిక్షణ ఇచ్చారు.9 కేటగిరిలో..... కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీలలో జరుగుతున్న పనులను 9 కేటగిరీలలో విభజించి అంచనా వేస్తున్నది. అందులో పేదరిక నిర్మూలన, ఆరోగ్య పంచాయితీ, చైల్డ్ ఫ్రెండ్లీ, అవసరమైన మంచినీటి సౌకర్యం, శుభ్రత పచ్చదనం, స్వయం ఆర్థిక వనరులు, సోషల్ సెక్యూర్డ్, ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయితీ గ విభజించింది. ప్రతి అంశానికి వంద మార్కులు ఇస్తారు. గ్రామాలలో మహిళా సంఘాల సమావేశాలు నిర్వహణ, కమ్యూనిటీ భవనం, గ్రంథాలయం, కరెంటు, కంప్యూటర్ వసతులు, కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామాలకు అందుతున్న వృద్ధులు ,వికలాంగుల పెన్షన్ వివరాలు, తడి చెత్త పొడి చెత్త విభజించడం, సేంద్రియ ఎరువుల తయారీ, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి వాడే విధానం, చిన్నపిల్లలకు అందిస్తున్న పోషక ఆహార వివరాలు మొదలగు ప్రశ్నలు ఉన్నాయి.తనిఖీలు.... కేంద్ర ప్రభుత్వం ఈనెల 31 తేదీ వరకు వివరాలు మొత్తం ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం ఇచ్చింది. కార్యదర్శిలు పంపిన వివరాలను తీసుకొని కేంద్ర రాష్ట్ర అధికార బందాలు గ్రామాలను తనిఖీలు చేసి పరిశీలిస్తారు.
పెద్ద మొత్తంలో బహుమతులు : కేంద్ర ప్రభుత్వం ఉత్తమ గ్రామపంచాయతీలకు అందిస్తున్న బహుమతులలో భారీ స్థాయిలో ఉన్నాయి. జాతీయ స్థాయి ఉత్తమ గ్రామపంచాయతీలకు మొదటి బహుమతి కోటి 50 లక్షలు, రెండవది కోటి 25 లక్షలు, మూడవ బహుమతి కోటి రూపాయలు. జిల్లా యూనిట్ గా ఎంపికైన గ్రామపంచాయతీలకు మొదటి బహుమతి మూడు కోట్లు రెండవది మూడు కోట్లు మూడవ బహుమతి రెండు కోట్లుగా ప్రకటించారు. మండల యూనిట్ గా ఎంపికయ్య గ్రామపంచాయతీలకు మొదటి బహుమతి కోటి రూపాయలు రెండవది 75 లక్షలు మూడో బహుమతి 50 లక్షలు గా నిర్ణయించారు. దీంతోపాటు మంచి ప్రతిభ ఉన గ్రామపంచాయతీలో కూడా అవార్డులు ఇవ్వను న్నారు.
మంత్రుల రికమండుకు చెక్ : గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రులు అవార్డులు మా గ్రామాలకే రావాలని కేంద్రానికి రికమండు చేసేవారు. ఈ ఏడాది అవకాశం లేకుండా పారదర్శకంగా ఉండే విధంగా వివరాలను ఆన్లైన్లో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది.