Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- వనపర్తి
ప్రభుత్వం టీఎస్-ఐ పాస్ ద్వారా సబ్సిడీ రుణాలు అందిస్తుందని,యువత ఆర్థికాభివద్ధి పొందేందుకు సద్విని యోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శుక్రవారం ఐడీసీఓ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ టీఎస్-ఐ పాస్ సబ్సిడీ రుణాలపై కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ,ఎస్టీలకు 7 యూనిట్లు, టీఎస్పీలకు 12 యూనిట్లు, పావలా వడ్డీ ఎస్టిలకు 1 చొప్పున సబ్సిడీ రుణాలను కమిటీ ఆమోదించినట్లు ఆయన వివరించారు.ఎస్సీ,ఎస్టీ వర్గాల యువత ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ యాదగిరి, ఫైర్ ఆఫీసర్ చంద్రశేఖర్, టీఎస్. ఐఐసీ, మేనేజర్ శ్రీనివాసులు, అసిస్టెంట్ ట్రెజరీ అధికారి విజయ సారధి, టీఎస్ పీసీబీ సాయివిద్య మనీ నాయక్, టీఎస్ ఎస్పీడీసీ ఎల్ వేణు, డీటీ సీపీఓ ప్రతాప్, డీటీఓ విజయ సర్దార్, డీసీటివో నాగేందర్, సీనియర్ అసిస్టెంట్ రామ్ శేఖర్, డీఐసీసీఐ సోమశేఖర్, ఎస్సీ కార్పొరేషన్ అధికారి మల్లికార్జున్, డిటిడిఓ ఏవో దిలీప్ కుమార్ పాల్గొన్నారు.