Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- వనపర్తి
జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులలో జాప్యం లేకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులకు ఆదేశించారు. శుక్రవారం ఆత్మకూర్,అమరచింత, మదనాపూర్ మండలాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్బంగా ఆత్మకూర్ బస్తి దవాఖానను, మదనాపూర్ ఊకచెట్టు తండా వాగును ఆమె పరిశీలించి, అక్కడ జరుగు తుున్న అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పేదవారికి మెరుగైన వైద్య సేవలు అందించేలా బస్తి దవాఖానలు తోడ్పడతాయని ఆమె అన్నారు. బస్తి దవాఖాన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆమె ఆదేశించారు. మదనాపూర్ మండలంలోని ఊక చెట్టు తండా వాగు ద్వారా రహదారులు, రోడ్లు, రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేలా వాగు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆమె సూచించారు. అనంతరం అమరచింత మున్సి పాలిటీ పరిధిలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాం మోహ న్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ అమరచింత మున్సి పాలిటీ అభివృద్ధి పనులపై మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ హరితహారం, ప్లాంటేషన్, పారిశుధ్యం, మిషన్ భగీరథ, పట్టణ ప్రకృతి వనాలు, తడి చెత్త, పొడి చెత్త సేకరణ, వైకుంఠ దామాలు తదితర కార్యక్రమాల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. అమరచింత మున్సిపల్ కార్పొరేషన్లో అన్ని వసతులు కల్పిస్తామన్నారు. మున్సిపాలిటీని ఆదర్శంగా తయారు చేసేందుకు కౌన్సిలర్లు, సిబ్బంది, ప్రజలు సహకరించాలని ఆమె సూచించారు. ఏవైనా సమ స్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మున్సిపాలిటీలలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు. ప్లాస్టిక్ నిషేధం ఉన్నందున ఎక్కడ ప్లాస్టిక్ ఉపయోగించ రాదన్నారు.పర్యావరణాన్ని పరిరక్షిం చాలని ఆయన సూచించారు. అమరచింత మున్సిపాలిటీ పరిధిలో కళ్యాణలక్ష్మి చెక్కులను జిల్లా కలెక్టర్, మక్తల్ ఎమ్మెల్యేల చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ వెంట ఆర్అండ్బి డీఈ దానయ్య, ఆత్మకూర్ మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రి, పంచాయతీ రాజ్ డిప్యూటీ ఈఈ శ్రీనివాస్, రవి కుమార్ యాదవ్, మున్సిపల్ అధికారులు, తహశీల్దార్, ఎంపీడీఓలు, అమరచింత మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, వార్డ్ కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.