Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబ్‌నగర్ డెస్క్ : రాహుల్ గాంధీ భారత్ జోడో(పాద) యాత్రలో భాగంగా మదాసి కురువ/మదారి కురువలు తప్పుడు కుల పత్రాలతో ఎదురుకుంటున్న కుల ధ్రువీకరణ పత్రాల గురించి తెలంగాణ ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని తెలంగాణ మదాసి కురువ/మదారి కురువ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కురువ విజరు కుమార్ అన్నారు. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మెంబెర్లై అయిన నేను పార్టీ పెద్దలను ఒప్పించి ఆరోజు కాంగ్రెస్ మెనుఫెస్టోలో కూడా పెట్టించడం జరిగిందని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చిందని ఇప్పటికీ ఆ హామీ నెరవేర్చడం లేదని విమర్శించారు. దయవుంచి మా కుల సమస్యను స్థానిక కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా మా కులానికి అండగా ఉండేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.రాహుల్ గాంధీ గారు విజరు కుమార్ గారు ఇచ్చిన మదాసి కురువ వినతిపత్రాన్ని వెంటనే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి ఇచ్చి ఈ అంశానికి సంబంధించి పూర్తిగా న్యాయం జరిగేలా మదాసి కురువలకు అండగా ఉండేలా కృషి చేయమని ఆదేశించారు.ఈసందర్బంగా రాహుల్ గాంధీ గారికి మా అంశాన్ని చర్చించడానికి అవకాశం కల్పించిన మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్‌కి, రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి,మధుయాస్కి గౌడ్‌కి,భట్టి విక్రమార్క , సంపత్ కుమార్‌కి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కురువ విజయ్ కుమార్, మరికల్ రాఘవేంద్ర కుల పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు.