Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్ నడకలో నడక
- విజయ సంకేతం ఇస్తూ... ముందుకు
- రక్షణ చర్యల వల్ల విసుక్కున ప్రజలు
- ప్రజలకు బరోసా నాయకులకు స్పూర్తి
- జిల్లాలో మూడో రోజు సాగి పాదయాత్ర
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
రాహుల్ పాదయాత్ర మూడో రోజు నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాలో జోరుగా ముందుకు సాగింది. రాహుల్ పాటు నడవాలని నాయకులు, అభిమానులు పోటీ పడ్డారు. అయితే జాతీయ రక్షణ సిబ్బంది వల్ల ఇబ్బందులు పడ్డారు. సమీపంలోకి ఎవ్వరూ... రాకూడదన్న నిబంధనలు ఉండటంతో కొంత నిరాశా కల్గింది. అయితే రాష్ట్ర నాయకులైనా బట్టి, రేవంత్‌రెడ్డి, మల్లు రవి, సంపత్ కుమార్‌తో సెల్పీలు తమ అకాంక్షను తీర్చుకున్నారు. ఉదయం నారాయణపేట జిల్లా మర్రికల్ మండలం ఎల్లిగండ్ల గ్రామ సమీపంలో గురువారం రాత్రి బస చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 6గంటలకే లేచి పాదయాత్ర మొదలు పెట్టారు. దారి పోడువునా అభివాదాలు చేశారు. ప్రజల నుండి బారీ స్పందన వచ్చిది. చేతులెత్తి అభివాదం చేశారు. ప్రధాన కూడలిలో అయితే విద్యార్థులు యువత అభివాదానికి ప్రతిగా కేరింతలు ఈలలతో దద్దరిల్లింది. తర్వాత దేవరకద్ర మండలం గోప్లానపూర్ కలాన్ దగ్గర బ్రేక్పాస్ట్ ముగించుకొని సాయంకాలం మహబూబ్‌నగర్ జిల్లా మన్నెంకొండ దగ్గర బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రాత్రికి జెపిఎన్‌సిఇ కళాశాలలో బస చేశారు. శనివారం ఉదయం మర్గమద్యలో గోపాల్‌రెడ్డి గార్డెన్లో టిపిన్ చేస్తారు. ఎస్విఎస్,ఎనుగొండ, సాయంకాలం జడ్చర్ల జంక్షన్ దగ్గర బారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాత్రికి గొల్లపల్లి మలయాల స్వామి లలతాంబిక తపోవణంలో రాత్రికి విశ్రాంతి తీసుకుంటారు. ముఖ్యంగా పాదయాత్ర సందర్బంగా అనేక మంది తమ సమస్యలు వారి దృష్టికి తీసుకొచ్చారు. మాధాసి కురుమ సామాజిక వర్గాన్ని ఎస్స్సీలో చేర్చాలని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పాదయాత్రలో పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి. సంపత్‌కుమార్, బట్టి విక్రమార్క, జైరామ్మేష్ తధితరులు పాల్గొన్నారు.