Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- మహబూబ్ నగర్
మహబూ బ్ నగర్ జిల్లా కేంద్రంలో కొత్తగా బీసీ మహిళ కళాశాల హాస్టల్ ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవో శంకర్ కు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ప్రస్తుతం ఒకే హాస్టల్ ఉండడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. 150 మంది విద్యార్థినిలు ఉండే హాస్టల్లో 2050 పైగా విద్యార్థులు ఉంటున్నారని తెలిపారు. దీంతో కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిలో విద్యార్థులు ఉన్నారని వారు గుర్తుచేశారు ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం కొత్తగా మరో బీసీ మహిళ కళాశాలను ఏర్పాటు చేసి విద్యార్థులను ఆదుకోవాలని వారు కోరారు .ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భరత్, నందు సంజు, భాను, తదితరులు పాల్గొన్నారు.