Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధిలో అధికారులు, కౌన్సిల్ సభ్యులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు.
- అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరి సహకారం అవసరం.
- స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి,జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష
నవతెలంగాణ- అమరచింత
అమరచింత మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అనేక నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేసే తీరుతా అని స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం అమరచింత మున్సిపాలిటీ పురపాలక కార్యాలయంలో అమరచింత మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. నూతనంగా ఏర్పడిన అమరచింత మున్సిపాలిటీ పురపాలక కేంద్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ అధికారులు కౌన్సిల్ సభ్యుల సహాయ సహకారాలు తప్పనిసరిగా ఉండాలని వారు పేర్కొన్నారు. ఇందులో ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వీల్లేదని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని వారు అన్నారు. కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ కాలనీల కోసం మేము అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కొంతమంది అధికారులు మాకు సహకరించడం లేదని మేము చేసే పనులకు ఆటంకం కలుగజేస్తున్నారని వారు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ. అమరచింత మున్సిపాలిటీ అభివృద్ధికి ఎవరైనా ఏ అధికారైన ప్రజా ప్రతినిధులైన కౌన్సిల్ సభ్యులైన ఆటంకం కలిగిస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిని వదిలిపెట్టే పరిస్థితి లేదని ఆయన హెచ్చరించారు. ఎందు కోసం అంటే నూతనంగా మన అమరచింతను మండలం చేసుకున్నాము, అదేవిధంగా మున్సి పాలిటీ కూడా చేసుకున్నాం కానీ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం బి ఆర్ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనేక సంక్షేమ పథకాలను అభివృద్ధి కోసం నిధులను కేటా యించడం జరుగుతుందని తెలిపారు. వచ్చిన నిధులను సద్విని యోగం చేసుకొని అభివృద్ధి చేసుకోవాలన్నారు. కానీ అడ్డుపడి అభివృద్ధి కాకుండా చేస్తే మాత్రం సరైన పద్ధతి కాదని వారిని క్షమించే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. నేను అమరచింత అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలను నిధులను తీసుకువచ్చి అభివృద్ధికి సహకరిస్తానని మీరు కూడా నాకు అందరూ సహకరించాలని ఆయన సూచించారు. అభివృద్ధి సహకారం కోసం మనకు జిల్లా కలెక్టర్ కూడా సహాయ సహకారాలు ఉంటాయని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ. అమరచిత మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరిస్తానని కానీ మీరు కూడా నాకు సహకరించాలని అధికారులు కానీ కౌన్సిల్ సభ్యులు కానీ ఎవరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా సహకరించాలని ఆమె ప్రతి ఒక్కరి కి సూచించారు. అనంతరం అమరచింత మండలం జర్నలిస్టులు తమ సమస్యలు పరిష్కరించాలని తమకు డబల్ బెడ్రూంలు ప్లాట్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంగమ్మ నాగభూషణం గౌడ్, వైస్ చైర్మన్ జిఎస్ గోపి, కమిషనర్ మహమ్మద్ కాజా, తహసీల్దార్ సింధుజ, ఎంపీడీవో జ్యోతి, ఏ ఈ ధర్మరాజు, కౌన్సిల్ సభ్యులు కే విజయ రాములు, రాజకుమార్, రాజశేఖర్ రెడ్డి, సింధు, లక్ష్మీ వెంకటేష్, లావణ్య, మమత, కో ఆప్షన్ సభ్యులు ఏపీ రాజేందర్, షాహిన్ బేగం రఫీ, వీరితో పాటు వివిధ శాఖల అధికారులు పలువురు పాల్గొన్నారు. అనంతరం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష చేతులమీదుగా పంపిణీ చేశారు.