Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -కల్వకుర్తి
నూతన వరి సాగు విధానంపై పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రొఫెసర్లు శుక్రవారం కల్వకుర్తి మండల పరిధిలోని రఘుపతిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు అవగాహన కల్పించారు గ్రామానికి చెందిన రైతు అనంత ప్రవీణ్ రెడ్డి వ్యవసాయ పొలంలో శాస్త్రవేత్తలు ప్రభాకర్ రెడ్డి, రాజశేఖర్ గీత డాక్టర్ రాజశేఖర్ తదితర ప్రొఫెసర్లు వ్యవసాయ పొలంలో పర్యటించి గ్రామానికి చెందిన రైతులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి సాగులో పాత పద్ధతులు పాటించకుండా నూతన వ్యవసాయ విధానం ద్వారా అత్యధిక లాభాలు అర్జించే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. ఇటీవల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే వరి వంగడాలు అందుబాటులో ఉన్నాయని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఉట్కూర్: మండల పరిధిలోని చిన్నపొర్ల గ్రామ రైతువేదికలో జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ యాసంగి పంటల సాగు పై రైతులకు అవగాహన నిర్వహించారు. వివిధ రకాల పంటల సాగు విధానం అలాగే వ్యవసాయ, ఉద్యానవన శాఖలో ఉన్న రాయితీల గురించి, క్షేత్ర స్థాయిలోని రైతుల సమస్యల రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖాధికారులు మాట్లాడుతూ వరి పంటకి ప్రత్యామ్నాయంగా నూనె గింజల పంటలు వేరు సెన గ కుసుమలు ఆమోదం ఆయిల్ ఫామ్ పప్పు దినుసులు పెసర్లు మినుములు వేసుకోవడం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ లాభాలని పొందవచ్చని సూచించా రు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాలి పటేల్ రవీందర్ రెడ్డి వ్యవసాయ శాఖ ఏఈవో కల్పనతోపాటు గ్రామ రైతులు పాల్గొన్నారు
తిమ్మాజిపేట: మిరప పంటలో ఉత్తమ ఫలితాలకోసం వ్యవసాయ అధికారులు సలహాల మేరకు పంటపై రెండు సార్లు పిచికారి చేస్తే అధిక దిగుబడులు వ స్తాయని రావేపు విద్యార్థులు రైతులకు సూచించారు. శుక్రవారం మండలం లోని ఆవంచలో రైతు మాధవులు వేసిన మిరప పంటలో నానో యూరియా డెమోను ఇచ్చారు. ఈ సందర్భంగా మిరప పంటపై చీడపీడల ఆశిస్తే నానో యూరియాను ఆకుల మీద పిచికారి చేసేటప్పుడు ఇది ఆకుల రంధ్రాల ద్వారా సులభంగా ఆకు లోనికి ప్రవేశించి కణజాలము సులువుగా పిలుచుకొని పంట అభివృద్ధి చెందుతుం దని తెలిపారు. ఏఈవో సాయిరాం, రావేప్ విద్యార్థినులు ఆకాంక్ష, తారక, యాస్మిన్, మౌనిక, గీతాంజలి, హైమావతి, ఇఫ్కో అధికారి మోహన్ ఉన్నారు.
పెద్దకొత్తపల్లి: మండలం పరిధిలోని పలు గ్రామాల్లో వేరుశనగ పంటను రైతులు వేరుశనగ పంటను వేశారని వీటికి లద్దె పురుగు, ఆకుపచ్చ ముడత తెగులు వ్యాధులు బలంగా ఉన్నాయని ఏఈవో రమేష్ నాయక్ ప్రకటనలో తెలిపారు .శుక్రవారం మండలంలోని సాతాపూర్లోని రైతుల పొలాలలో వేసిన వేరుశనగ పం టను తన బృందంతో వెళ్లి పరిశీలించినట్లు తెలిపారు. రైతులు వేసిన వేరుశనగ పంటకు లద్దె పురుగు ఆకు ముడత పురుగు తెగుళ్లు అధికంగా ఉన్నాయని, వీ టిని నిర్మూలనకోసం న్యూ వత్యారాన్ 500 గ్రాములకు ఆక్రో, ఎసిఫేట్ 300 గ్రా ములకు ఆక్రోను కలిపి పిచికారి చేసినచో తెగులను నివారించవచ్చునని ఆయన రైతులకు సూచించారు. ఆయనతోపాటు ఏఈవోలు, రైతులు వినోద్, మల్లేష్ తదితరులు ఉన్నారు.