Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ ఉదయకుమార్
నవతెలంగాణ- కల్వకుర్తి టౌన్
ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపరిచి విద్యార్థుల కు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ ఉదయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం కల్వకుర్తి మండల పరిధిలోని తోటపల్లి, బెక్కెర ప్రభుత్వ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించడమే కాకుండా విద్యార్థుల నోటు పుస్తకాలను పరిశీలించి వి ద్యార్థులను పలుఅంశాలపై ప్రశ్నలుఅడిగారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మరింత పెం చేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. అవసరమైతే విద్యార్థుల తల్లి దండ్రులతో మాట్లాడి వారికి అవగాహన కల్పించాలని అన్నారు. పాఠశాలల్లో వి ద్యాబోధన చేసే ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా తోటపల్లి ప్రధానోపా ధ్యాయుడు విజయభాస్కర్ రెడ్డిని ఆయన ఉపాధ్యాయులకు ఇలా సెలవులు ఇస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. ఆయనతోపాటు ఏంఈవో బాసు నాయక్ తదితరులున్నారు.