Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -మరికల్
ఇత్తనైల్ కంపెనీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రొఫెసర్ లక్ష్మీనా రాయణ అన్నారు. మండలంలోని ఆదివారం వైఎస్ ఫంక్షన్ హాల్లో ఏర్పా టు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఆక్రమించిన 20ఎకరాల ఆసైన్డ్ భూ మిని 13మంది లబ్ధిదారులకు తిరిగి ఇవ్వాలని నక్ష బాటను పునరుద్ధరిం చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అవసరాలకు ప్రభుత్వ భూ ములు వాడుకోవాలని 2013 సంవత్సరంలో ప్రభుత్వం ఇచ్చిన 72జీవో ప్రకా రం జూరాలకు ఇచ్చే వరద నీటి నుంచి ఎత్తిపోతల పథకం చేపట్టి ఉమ్మడి మహబూబ్‌నగర్, జిల్లా ఉమ్మడి రంగారెడ్డి, జిల్లాలో పడమటి భాగాలకు సా గునీరివ్వాలన్నారు. ఇత్తనాలు కంపెనీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. 32 గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రొఫెసర్ లక్ష్మీనారా యణ తెలిపారు. సైంటిస్ట్ బాబురావు పూలే మాట్లాడుతూ.. పాలకులు అధికా రులు అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతు న్నారన్నారు. సాగు చేసుకుంటామని భూములు కొనుగోలు చేసి, పరిశ్రామికవేత్త పచ్చని పొలా లలో డీజిల్, పెట్రోల్‌కు ఉపయోగపడే లిక్విడ్ తయారిని ఏర్పాటు చేస్తున్నారన్నా రు. లిక్విడ్ తయారు చేసే విత్తనాల ఫ్యాక్టరీతో ఆయా గ్రామాల్లో వ్యవసాయ భూ ములు, ప్రజల ఆరోగ్యాలు, కాలుష్యం, కొరలలో చిచ్చుకుపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్టీయూ ఎస్ఎం ఖలీల్ మాట్లాడుతూ.. విత్తనాల పరిశ్ర మ ద్వారా వెలువడే కాలుష్యంతో తమ ఆరోగ్యాలు పాడవుతాయని పంటలు పండ వని ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా చూడాలన్నారు. అన్నం పెట్టే మట్టిలో విషయం కలుపుతున్న పెట్టుబడి దారులను వారికి అండగా నిలుస్తున్న పాలకుల నిలదీయాలని హెచ్చరించారు. వ్యవసాయ పంటలు పండే పరిస్థితిలో దూరమవుతాయని ఆ కంపెనీ విసర్జించి వ్యర్థాలతో వాతావరణ కాలుష్యం, భూ కాలుష్యం ఏర్పడి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఇత్తనాల కంపెనీ వ్యతిరేక పోరాట సమితి ప్రజా సంఘాలు, కుల నిర్మూలన పోరాట సమితి ఏకమై కంపెనీ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం నాయ కులు లెక్చరర్ లక్ష్మయ్య, సుదర్శన్, వెంకట రాములు, మండల అధ్యక్షుడు ఆంజ నేయులు, విత్తనాల కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు మురళి, చక్రవర్తి, చింతలయ్య, మని వర్ధన్ రెడ్డి, రాజా వర్ధన్, వివిధ గ్రామాల వ్యవసాయ దారులు మహిళలు పాల్గొన్నారు.