Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు బి నరసింహ
నవ తెలంగాణు- అలంపూర్
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు బి నరసింహ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్నభోజన కార్మికుల మండల కమిటీని జెడ్పీహె చ్ఎస్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు నరసింహ, కమిటీ సభ్యురాలు ఏమెలమ్మా మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. కార్మికులకు పెంచిన రూ. 2వేలు ఇంకా ఇవ్వడంలేదని, మధ్యాహ్న భోజన కార్మికులు బడుగు బలహీనవర్గాలకు చెందిన వారికి బిల్లులు పూర్తిగా చెల్లించలేదని ఆరోపించారు. కార్మికులను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవ్వాలని, వంట పాత్రలు గ్యాస్ సిలిండర్లు వంట పాత్రలు గ్యాస్ సిలిండర్లు, అంగన్వాడీ సెంటర్ల తరహాలో గుడ్లు సరఫరా చేయా లని, ప్రతి పాఠశాలలో వంటగది నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠ శాలల్లో నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు పెట్టడానికి మిడ్డేమీల్స్ వర్కర్లను ని యమించి కొన్ని స్వచ్చంద సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేసున్నారని అన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాల నిర్వహించాలని పిలుపుని చ్చారు. అనంతరం మధ్యాహ్న భోజన కార్మికుల 2వ జాతీయ మహాసభల పోస్టర్ను విడుదల చేశారు. కార్మికుల మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. మం డల కార్యదర్శిగా టి.పద్మావతి, సహాయ కార్యదర్శురాలిగా మాధవి, ఆర్. బుజ్జమ్మ, అధ్యక్షురాలిగా పార్వతమ్మ, ఉపాధ్యక్షురాలిగా మునెమ్మ, కో-శాధి కారిగా కోనేరు లక్ష్మి దేవమ్మ, సభ్యులుగా జ్యోత్స్న, సలిమాబి, జయమ్మ, రాధమ్మ, మార్తమ్మ, వీరా మని, లలితమ్మ, అనిత, అస్మా, ఖాజాబి, మద్దమ్మలను ఎన్నుకున్నారు.