Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. 20 లక్షల నిధులతో పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే చిట్టెం
నవతెలంగాణ- అమరచింత
మండల పరిధిలోని చంద్ర నాయక్ తండాలో ఆదివారం సీసీ రోడ్డు నిర్మాణా నికి రూ. 20 లక్షల నిధులతో ఎమ్మెల్యే చిట్టెం భూమి పూజచేసి పనులను ప్రా రం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ప్రతి గ్రామానికి రూ. 20 లక్షల రూపా యలు అభివృద్ధి పనులకు మంజూరు చేసిందన్నారు. గ్రామాల్లోని సీసీరోడ్డు, డ్రైనేజ్ మిగతా పనులకు ఈ నిధులు వాడుకొని గ్రామాలను అభివృద్ధి పథంలో ఉంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శిల్పశంకర్ నా యక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేష్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు జింక రవి, ఏఈ ధర్మరాజు, మాజీ సర్పంచ్ గోపాల్‌నాయక్, వెంకటయ్య, రఫీ, హన్మంతు నాయక్, మంగా నాయక్ తదితరులు పాల్గొన్నారు.