Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆడబిడ్డలకు అండగా నిలిచిన ఏకైక నాయకుడు కేసీఆర్
- పేదల బతుకుల్లో బాధలు చూసింది తెలంగాణ ప్రభుత్వమే
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
- ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ
నవ తెలంగాణ- వనపర్తి
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికి ఆదర్శమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేవల్లి, గోపాల్ పేట, శ్రీరంగాపురం, పెబ్బేరు, పెద్దమందడి, ఖిల్లాఘణపురం మండలాలకు చెందిన 259 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాధీముబారక్ చెక్కులు అందజేసి మంత్రి నిరంజన్ రెడ్డి వారితో సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆడబిడ్డ పె ళ్లికి కల్యాణలక్ష్మి పథకం కింద రూ. లక్ష 116లు, గర్భిణికి అమ్మఒడి పథకం కింద పౌష్టికాహారం అందజేస్తుందన్నారు. కాన్పు అయితే కేసీఆర్ కిట్ ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు సాయం అందిస్తున్నామ న్నారు. వృద్ధులు ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృత్తి కార్మికులు, వితంతు మహిళలకు రూ.2,116, రూ.3,116 సాయం చేస్తున్నామన్నారు. రైతుబంధు పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు రైతుకి ఇస్తున్నామన్నారు. ప్రమా దవశాత్తు ఏ కా రణం చేత మృతిచెందిన రైతుభీమా పథకం కింద రూ.5 లక్షల పరిహారం ప్రభు త్వం చెల్లిస్తుందన్నారు. మిషన్ కాకతీయతో చెరువులు, కుం టల మరమ్మతు, మి షన్ భగీరథ కింద ఇంటింటికీ సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. గొల్ల, కురుమల ఆర్థికవృద్ధికి సబ్సిడీపై గొర్రెపిల్లలు అంద జేస్తు న్నామని మంత్రి తెలిపారు. మత్స్యకారుల అభ్యున్నతి కోసం ఉచిత చేపపిల్లల పంపిణీ చేపట్టి చె రువుల్లో వదిలేయమన్నారు. దళితుల ఆర్థిక స్వావలంబన కోసం దళితబంధు పథ కం ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని తెలిపారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగ తి, హరితహారం పథకాలు దేశానికే దిక్సూచిగా నిలిచాయన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే ఇన్ని పథకాలు పక్కాగా అమలు చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.