Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మండల కేంద్రాలలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేశారు. నేడు కనీస వసతులు నోచుకోక విద్యార్థినులు తల్లిదండ్రులు కళాశాల సిబ్బంది సైతం అనేక ఇబ్బందులకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- కాస్మోటిక్ బిల్స్ బంద్
- నేటికీ అందని డ్రెస్ కోడ్ యూనిఫామ్
- నోటు పాఠ్యపుస్తకాల ఇక్కట్లు
- మెయింటినెన్స్ నిధులు రావడం లేదు
- అధికారులకు నివేదికలు పంపుతున్నాం : ఎస్ఓ
- కనీస వసతులు కల్పించలేకపోతున్నాం
- సబ్బులు డబ్బుల కు తల్లిదండ్రుల ఇక్కట్లు
- భోజనంలో మెనూ నామమాత్రం
- పారిశుద్ధ్య లోపం అనారోగ్యాలకు గురి
- ప్రభుత్వం అధికారులు స్పందించాలి
- విద్యార్థి సంఘాల నాయకుల ఆందోళన
నవతెలంగాణ - బల్మూరు
బల్మూరు మండల కేంద్రం బల్మురులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం జూనియర్ కళాశాలలో సైతం ఇదే పరిస్థితి కొనసాగుతుంది. విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు కావస్తున్నా నేటికీ విద్యార్థులకు కాస్మోటిక్ బిల్స్ అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని విద్యార్థునులు తెలిపారు.గత సంవత్సరం ఇచ్చిన డ్రెస్ కోడ్ యూనిఫామ్ పూర్తిగా అయిపోయాయని నేటికీ డ్రెస్ కోడ్ యూనిఫామ్ లు అందలేదని విద్యార్థులు వాపోతున్నారు. డ్రెస్ కోడ్ యూనిఫామ్ లు కుట్టిం చేందుకు వెలుగు సిబ్బందికి అప్పజెప్పి నప్పటికీ వారి అలసత్వం నిర్లక్ష్యం కారణంగా నేటికీ డ్రెస్ కోడ్ అందలేదని తెలిపారు. పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు ఇవ్వక పోవడంతో పాత పాఠ్యపుస్తకాలతోనే సర్దుకుంటున్నామని నోటు పుస్తకాల లేక బయట కొనుక్కొని రాసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కస్తూర్బా లో కనీసం మెయింటినెన్స్ నిధులు కూడా రావడం లేదని సమేత అధికారులు కు విన్నవించినప్పటికీ నివేదికల పంపుతున్నామని అధికారులు తెలుపుతున్నప్పటికీ మెయింటినెన్స్ నిధులు నేటికీ రాలేదని వాపోతున్నారు. కనీస వసతులు కల్పించలేకపోతున్నామని గదులలో సీలింగ్ ఫ్యాన్లు బల్బులు ఏర్పాటు లేక అవసరుపడుతున్నామని విద్యార్థులకు తెలిపారు. సభ్యులకు ఇతర ఖర్చులకు డబ్బులు తల్లిదండ్రులను ఇక్కట్లకు గురి చేస్తున్నామని విద్యార్థులు తెలుపుతున్నారు. కాస్మెటిక్స్ బిల్స్ వచ్చినట్లయితే తల్లిదండ్రులు పదేపదే వసతి గృహాలకు హాస్టలుకు వచ్చేవారు కాదని తెలిపారు. భోజనంలో సైతం మేము నామమాత్రంగా పాటిస్తున్నారని సరైన భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు కొందరు పస్తులు ఉంటున్నామని ఆరోపిస్తున్నారు. పారిశుద్ధ్య లోపంతో చుట్టూ పరిసరాలు సక్రమంగా లేకపోవడంతో ఈగలు దోమలు పెరిగి అనారోగ్యాల బారిన పడుతున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించాలని విద్యార్థినిల తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని పలు సందర్భాలలో విద్యార్థి సంఘాల వారు ఆందోళన చేపట్టినప్పటికీ వారి ఆందోళనను పట్టించుకోవడంలేదని తెలుపుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి కస్తూర్భాలో నెలకొన్న విద్యార్థుల కష్టాలను తీర్చాలని విద్యార్థిని తల్లిదండ్రులు కోరారు.