Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్వానంగా రోడ్లు అవస్థలు పడుతున్న ప్రజలు
- ప్రమాదాలు జరిగినా పట్టించుకోని పాలకులు
- ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం శూన్యం
- పొలాలకు వెళ్లలేక పోతున్నామంటూ రైతుల ఆందోళన
నవతెలంగాణ - ఊరుకొండ
పొలాలకు వెళ్లే డొంకరోడ్డు ఆధ్వానంగా మారడంతో కాలినడకకు సైతం ఇబ్బందిగా మారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఊరుకొండ మండల కేంద్రం నుండి కల్వకుర్తి , జడ్చర్ల రహదారి వైపు మరియు వ్యవ సాయ పొలాలకు వెళ్లే 30 ఫీట్ల డొంక రోడ్డు అధ్వా న్నంగా మారిందని రైతులు, వాహన దారులు వాపోతు న్నారు. ఈ రహదారిపై ప్రమాదాలు జరుగుతున్నామని ప్రజప్రతినిధులకు తెలిపినా పట్టించు కోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు. ఊరిలో నుండి, వ్యవసాయ పొలాల నుండి వచ్చే నీరు ఈ రోడ్డుపె నుంచి పారుతుండడంతో ఇక్కడ నీటికుంటలా మారిందంటున్నారు. ప్రతినిత్యం అటు వైపు వెళ్లే ప్రయాణికులు, వాహన చోదకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విశాలంగా ఉన్న మట్టి రోడ్డు పొలాల నుండి వచ్చే నీరు, మురుగునీరు, వర్షపు నీరు కారణంగా కాలి నడకకు సైతం కష్టంగా మారిందని స్థానికులు, రైతులు, ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డుపై పలుమార్లు ద్విచక్ర వాహ న దారులు ప్రమాదాలకు గురైన పట్టించుకునే నాధుడు కరువయ్యాడంటున్నారు. కొన్నిసార్లు ఆటో దిగబడి తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని వాహన చోదకులు వాపోతున్నారు. డొంక బాట దుస్థితి గురించి పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించిన ఏ మాత్రం పట్టించుకోవడంలేదని గ్రామ ప్రజలు ఆరోపి స్తున్నారు. వ్యవసాయ పొలాలకు పశువులను, మేకలను, గొర్రెలను తోలుకొని పోవాలంటే అడుగడుగున కాళ్లు దిగబడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటే పది నిమిషాల్లో వెళ్లే అవ కాశం ఉన్నా రోడ్డు పై నీటి కుంటలు, బురద మయంగా ఉండడంతో అరగంటకు పైగా ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. ప్రతి రోజు బురద నీటిలో వెళ్తుండడంతో కాళ్లు, కాలి వేళ్ళు పూర్తిగా చెడిపోయి నడువలేక ఆస్పత్రుల పాలవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఊరుకొండ గ్రామం నుండి ప్రధాన రహదారి వరకు కిలోమీటర్ మట్టి రోడ్డును బీటీగా మార్చితే పరిసర గ్రామాల ప్రజలకు, స్థానికులకు, వాహన చోదకులకు, గ్రామ రైతులకు ఇబ్బందులు తొలగి ప్రయా ణం సాఫీగా సురక్షితంగా సాగుతుందని మండల ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మండల ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు స్పందించి డొంక బాటను, మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చి ప్రమాదాలను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పలుమార్లు ప్రమాదాలకు గురయ్యాను
తమ వ్యవసాయ పొలానికి, కోళ్ల ఫారం వద్దకు ప్రతినిత్యం అదే బాట వెంబడి వెళ్లాల్సి ఉండడంతో పలుమార్లు ప్రమాదానికి గురయ్యాను. ద్విచక్ర వాహనం వెళ్లలేక కాలినడకన వెళదామంటే కూడా కష్టంగా మారింది. ఈ రోడ్డును బాగు చేసి స్థానిక రైతులకు, వాహన చోదకులకు ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- మేకల ప్రసాద్, రైతు ఊరుకొండ
ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు
మండల కేంద్రం నుండి ప్రధాన రహదారికి, వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటే తీవ్ర అవస్థలు పడాల్సి వస్తుంది. ఈ రోడ్డు దుస్థితి గురించి పలుమార్లు ప్రజాప్రతినిధులకు విన్నపించిన మాకు అవసరం లేదని ఆ బాటలో మాకు వ్యవసాయ పొలాలు లేవని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని వాపోయారు. ప్రజల సమస్యలు పట్టించుకోవాల్సిన అధికారులు ప్రజాపతులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటని వాపోయారు. తమకున్న పాడి గేదెలను తోలుకపోవాలన్న.. వ్యవసాయ పొలాలకు ఆటోలు, ట్రాక్టర్లు తీసుకుపోవాలన్న నరకయాతన పడుతున్నాము. సంబంధిత శాఖ అధికారులు స్పందించి బీటీ రోడ్డుగా మార్చి ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.
- పోలే ప్రసాద్, ట్రాక్టర్ డ్రైవర్, ఊరుకొండ