Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాతో విద్యార్థుల్లో తగ్గిన భాషా, గణిత సామర్థ్యాలు
- విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు పెంపొందించడమే కార్యక్రమ లక్ష్యం
- పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పి.ఉదయ్‌కుమార్ ఆదేశం
ఒకటి నుంచి ఐదో తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠ శాలల విద్యార్థుల్లో కనీస అభ్యసనా సామర్థ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్ర మాన్ని ఈ విద్యా సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేపడు తోం ది. జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రభుత్వం ఫౌండే షన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమా నికి శ్రీకారం చుట్టింది.
నవతెలంగాణ- కందనూలు
కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో భాషా, గణిత అభ్యసనా సామర్థ్యా లు గుర్తించిన ప్రభుత్వం తిరిగి వారిలో ఆయా సబ్జెక్టుల్లో సామర్థ్యాలు పెంపొందించడమే తొలి మెట్టు కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. 'న్యాస్, అనెస్' సర్వేల్లో నాగర్‌కర్నూలు జిల్లా విద్యార్థులు మరింత వెనుకబడినట్లు గుర్తించిన జిల్లా ఉన్నతాధికారులు తొలిమెట్టు కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించారు. కొవిడ్ అనంతర పరిణామాల తర్వాత ప్రాథ మిక విద్యా రంగాన్ని గాడిలో పెట్టడానికి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి.ఉదయ్‌కుమార్ జిల్లా విద్యాశాఖపై పర్యవేక్షణ పెంచారు. ఆయన ఆదేశంతో విద్యాశాఖ అదికారులు క్షేత్రస్థాయిలో నిత్యం పాఠశాలలను సందర్శించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలిస్తున్నారు. ఓ వైపు డీఈ వో, సెక్టోరియల్ అధికారుల ఆధ్వర్యంలో ఆకస్మిక సందర్శ నలు కొనసాగుతూన్నాయి.
రాష్ట్రంలో ఏ జిల్లాలో చేయని విధంగా తొలిమెట్టు కార్యక్రమాన్ని స్ఫూర్తివంతంగా నిర్వహించాలని ప్రతి పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయునికి బాధ్యతలను అప్ప గిస్తూ సెప్టెంబర్ 5వ తేదీన 691 ప్రాథమిక ఉన్నత పాఠశాలల నుండి ఒక్కో ఉపాధ్యాయుడి చొప్పున 691 మంది ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ స్వయంగా ఘనంగా సత్కరించారు.
'ఎఫ్ఎస్ఎన్ కమిటీలో జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ప్రత్యేక పరిశీలకురాలు వెంకటనరసమ్మ (అదనపు డైరెక్టర్ స్థాయి), డీఈవో గోవిందరాజులు, విద్యాశాఖ కో ఆర్డినేటర్లు సి.సతీష్‌కుమార్, బరపటి వెంకటయ్య, ఇద్దరు ఎంఈవోలు చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాసులు ఇద్దరు సీనియర్ హెచ్ఎంలు, ఆరుగురు రిసోర్సు పర్సన్లు విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను మదింపు చేస్తున్నారు..
నాగర్‌కర్నూలు జిల్లావ్యాప్తంగా 20 మండలాల్లోని 566 ప్రాథమిక పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 5వ తర గతి వరకు చదువుతున్న విద్యార్థులు 27,014 మంది ,12 5 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 5వ త రగతి వరకు చదువుతున్న విద్యార్థలు 11,613 మంది ఉన్నారు. మొత్తం 691 పాఠశాలల్లో ప్రస్తుత విద్యా సం వత్సరం 38,627 మంది 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు. ప్రాథమిక, ప్రాథమి కోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయు లు, ఎస్జీటీలు, ప్రాథమిక స్థాయిలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు 1715 మంది ఉపాధ్యాయులకు 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి జులై నుంచి ఆగస్టు వరకు మూడు విడతలుగా 'ఎస్ఎల్ఎన్ పై శిక్షణ ఇచ్చారు. విద్యార్థుల్లోని భాషా పరిజ్ఞానం (రాయడం, చదవడం)తో పాటు గణిత చతుర్విద ప్రక్రియలైన కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగాహారంపై మరింత పట్టు పెంచేందుకు వారంతా పక్కా ప్రణాళికతో పనిచేయాల్సి ఉంటుంది.
నెలవారీగా విద్యార్థుల ప్రగతిని పరీక్షించడం(బేస్ లైన్ టెస్ట్) నిర్వహించి 'టాస్ట్రిన్' అనే ప్రత్యేక యాప్‌లో విద్యా ర్థుల సామర్థ్యాలను నమోదు చేస్తున్నారు. ఈ వివరాలను జిల్లాస్థాయి కమిటీ రాష్ట్ర ముఖ్య పరిశీలకురాలు నరసమ్మ, కలెక్టర్ ఉదరుకుమార్, డీఈవో గోవిందరాజులు, కో ఆర్డినేటర్లు పరిశీలించి నేరుగా ఎస్సీఆర్టీ అధికారులకు పంపు తున్నారు. ప్రతి విద్యార్థిలో భాష పరిజ్ఞానం, గణిత భావన లు మెరుగుపడే వరకు ఈ కార్యక్రమం పకడ్బందీగా అమ లయ్యేందుకు గత కొద్ది రోజులుగా జిల్లా కలెక్టర్ స్వయంగా ఈ కార్యక్రమ అమలును పరిశీలిస్తుండగా కమిటీ సభ్యులు ఒక్కో పాఠశాలను సందర్శిస్తున్నారు.
అభ్యసనా సామర్థ్యాలు మెరుగౌతాయి
ఎఫ్ఎల్ఎన్ వల్ల విద్యార్థుల్లో కనీస అభ్యసనా సామర్థ్యాలు మెరుగ వుతాయి. కలెక్టర్ ఆదేశాలతో నిత్య పర్యవేక్షణ చేపడుతున్నాం. చిన్నారు లకు విషయ పరిజ్ఞానం అలవడి చది విన పాఠ్యాంశాలపై పట్టు సాధిస్తే లక్ష్యం నెరవేరినట్లే. ఇప్పటికే జిల్లాలో తొలిమెట్టు కార్యక్ర మం ప్రత్యేకత చాటుతోంది.
- డాక్టర్ గోవిందరాజులు, డీఈవో
ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉపయోగం
తొలిమెట్టుతో ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థుల్లో చద వడం, రాయడం చాలావరకు మెరుగుపడతాయి. ఇప్పు డు 2,3,4,5వ తరగతి చదువుతున్న విద్యార్థులు 6వ తరగతిలో చేరిన తర్వాత ఆంగ్లం, గణితం, ఇతర సబ్జెక్టుల్లో మంచి ప్రతిభను కనపరుస్తారు. వారు ఉపాధ్యాయుల బోధనను సులువుగా అర్థం చేసుకు నేందుకు వీలుంటుంది. తొలి మెట్టు కార్యక్రమం ఉన్నత పాఠశాల విద్యార్థు లకు కూడా ఎంతగానో తోడ్పాటునందిస్తుంది.
- హరిప్రియ, ప్రధానోపాధ్యాయురాలు,గగ్గలపల్లి ఉన్నత పాఠశాలు