Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -కొత్తకోట
అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుణ్ణి కఠినంగా శిక్షించాలని తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రాము మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం కొత్తకోటలో దళిత సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీ కార్యక్రమానికి ముఖ్యాతిథులుగా హాజరయ్యారు. ముందుగా చౌరస్తాలోని నాలుగు రోడ్లల్లో ర్యాలీ నిర్వహించి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా, ధరూర్ మండలం, రేవులపల్లి గ్రామంలో మధ్యాహ్న సమయంలో రేవులపల్లి గ్రామానికి చెందిన మున్నూరు కాపు కులానికి చెందిన రఘు, నల్లారెడ్డి అనే వ్యక్తి మంగళవారం మధ్యాహ్న సమయంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ తల భాగాన్ని పూర్తిగా ధ్వంసం చేసిన వ్యక్తిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. అక్కడ కొంతమంది వ్యక్తులు ప్రత్యక్షంగా వీడియో తీయడం జరిగిందని అంబేద్కర్ విగ్రహంను ధ్వంసం చేసిన సైకో రఘు రెడ్డిని బహి రంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. భారత దేశంలో బాబాసాహెబ్, మహనీయుల విగ్రహాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన సంగం అధ్యక్షుడు శివకుమార్ నాయక్, మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ మాదిగ, ఎస్సి ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యలు గంధం నాగరాజు, అంబేద్కర్ సంగం అధ్యక్షుడు ఇజ్రాయిలు, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బోయోజ్, కౌన్సిలర్లు పద్మ అయ్యన్న, ఖజమైనోద్దీన్, భాస్కర్, ప్రేమదానం, రమేష్, మన్యం, కళ్యాణ్, శ్యాం, నవీన్, నాగరాజు, సాదిక్, రవి, రాజు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అమరచింత : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూచిన నిందితున్ని కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకట రాములు డిమాండ్ చేశారు. శుక్రవారం మదనపురం మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు కేవీపీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో కూల్చడానికి వ్యతి రకంగా నిరసన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ. ధరూర్ మండలం రేవులపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత ప్రతి ఒక్కరికి సమ న్యాయం కోసం కులాల కతీతంగా మతాల కతీతంగా భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేధావి ఆయన విగ్రహాన్ని కూల్చడం హేయమైన చర్య గా భావిస్తున్నామని ఈ కూల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీ ఐ(ఎం) మండల కార్యదర్శి ఎస్ రాజు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బలి నిక్సన్, కేవీపీఎస్ నాయకులు చెన్నయ్య ,నాగన్న, సవరణ, విజరు పలువురు పాల్గొన్నారు.