Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -పెద్దమందడి
పెద్దమందడి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలతో పాటు అమ్మపల్లి, గట్లఖానాపురం, మద్దిగట్ల గ్రామాల పాఠశాలలను శనివారం ఎంపీడీవో ఆఫ్జాలుదిన్, ఇంచార్జి ఎంఈఓ జయశంకర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అఫ్జల్ మాట్లాడుతూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనము నాణ్యత మైన భోజనము అందించాలని అన్నారు. పాఠశాల అవరణలో ముండ్ల కంపలను, పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వంట గదులను పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని అన్నారు. పాఠశాల విద్యార్థులు చక్కగా చదువుకొని బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలి అన్నారు. ప్రభుత్వం ఉచిత భోజనంతో పాటు పాఠ్యపుస్తకాలు, దుస్తులను అందించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు సద్విని యోగం చేసుకొని తల్లిదండ్రులకు ఉపాధ్యా యులకు, గ్రామాలకు పేరు ప్రతిష్టలు తీసుకు రావాలని అన్నారు. అదేవిధంగా గ్రామాలలో నర్సరీ లను పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి గ్రామాలను పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.