Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరచింత : గత 25 సంవత్సరాల క్రితం ఇల్లు లేని వారికి నిరుపేదలకు ఇంట్లో నిర్మించుకునేందుకు పట్టాలు ఇవ్వడం జరిగింద నీ ఇచ్చి న పట్టాల కు పొజిషన్ హద్దులు చూపించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి, మున్సిపల్ వైస్ చైర్మన్ జిఎస్ గోపి డిమాండ్ చేశారు. శనివారం ఈ సందర్భంగా గుడిసెలు వేసుకొని పోరాటం చేస్తున్న లబ్ధిదారుల దగ్గర వారికి అండగా సీపీఐ(ఎం) ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం గ్రామపంచాయతీ పరిధిలో 25 సంవత్సరాల క్రితం దుంపాయి కుంటలో నిరుపేదలకు ప్లాట్లను ఇవ్వడం జరిగిందన్నారు. కానీ ఇప్పటివరకు ఇచ్చిన ప్లాట్లకు పొజిషన్ కానీ హద్దులు గాని చూపించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దుంపాయి కుంటలో లబ్ధిదారులు గుడిసెలు వేసుకొని నెల రోజులకు పైన వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ దీక్షలు నిర్వహిస్తుంటే అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్లుగా చూసి చూడనట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండటం చాలా సిగ్గు సెట్ అని ఆయన మండిపడ్డారు. ఒక్కరోజు కూడా వారు చేస్తున్న దీక్ష దగ్గరికి అధికారులు రాకపోవడం శోచనీయమన్నారు. తక్షణమే అధికారులు స్పందించి ప్రభుత్వమే ఇచ్చిన ప్లాట్ లకు పొజిషన్ హద్దులు చూపించి అక్కడే వారికి డబుల్ బెడ్ రూమ్ నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల నాయకులు బి వెంకటేష్, ఆర్యన్ రమేష్, ఎస్ అజయ్, బుచ్చన్న, శ్యాంసుందర్ గుడిసెల లబ్ధిదారులు పలువురు పాల్గొన్నారు.