Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- అమరచింత
భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని మాజీ అడ్వకేట్ జనరల్ హైకోర్టు మాజీ సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాష్ రెడ్డి సతీమణి గీతమలు దంపతులు అన్నారు. ఇటీవల విడుదల చేసిన నీటి ఫలితాల్లో తమ తమ ప్రతిభను కనబరిచి మెడికల్ సీట్ సాధించిన అమరచింత మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన ముగ్గురు విద్యార్థులను శనివారం అమరచింత పట్టణ కేంద్రంలో తన స్వగృహంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ. అమరచింత మున్సిపల్ కేంద్రానికి చెందిన వైడూర్యమ్మ వైఫ్ ఆఫ్ ఆదాంల కూతురు సింధు శ్రీ, పేదరికంలో పుట్టిన టైలర్ పనిచేస్తూ తన అబ్బాయిని చదివించిన పావు అరుణమ్మ వైఫ్ ఆఫ్ ఏసన్న ల కుమారుడు ప్రవీణ్, అదేవిధంగా పద్మశాలి కుటుంబంలో పుట్టిన నర్సింలు కుమారుడు రాహుల్ మెడికల్ లో ఎంబీబీఎస్ సీటు సాధించిన ఈ ముగ్గురు విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు వారికి శుభాకాంక్షలు తెలిపారు. వారి చదువు వృధా కాకుండా పదిమందికి ఉపయోగకరంగా ఉండే విధంగా ఇంకా గొప్పగా చదివి కన్న తల్లిదండ్రులకు ఉన్న ఊరుకు చాలా గొప్ప పేరు తీసుకురావాలని ఆయన కోరారు. వారికి భవిష్యత్తులో రాబోవు కాలంలో చదువులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే వారికి అండగా ఆర్థికంగా నా సహాయ సహకారాలు ఉంటాయని ఆయన వారికి సూచిం చారు.కార్యక్రమంలో అమరచింత లిఫ్టు మాజీ చైర్మన్ సౌజన్యమ్మ, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ నాగభూషణం గౌడ్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కమిటీ సభ్యులు ఎస్ శ్యామ్ పలువురు పాల్గొన్నారు.