Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబ్ నగర్ : భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌర్ణకుండే ఓటు హక్కు ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అన్నారు. ఓటు హక్కు నమోదు కోసం ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు గురువారం కలెక్టర్ కార్యాలయం నుంచి గడియారం చౌరస్తా వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో ఓటు కీలకపాత్ర వహిస్తుందని అన్నారు. ముఖ్యంగా ఓటర్లు మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు వారికి ఓటు హక్కే ఆయుధమని వారు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాల్సిన అవసరం ఉందని ,ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జనవరి 1, 2023 నాటికి 18 సంవత్సరాల నిండే ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోనేందుకుగాను, 2 నెలల ముందు నుండే అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సైకిల్ ర్యాలీలో జిల్లా అధికారులు ,పాఠశాల , కళాశాల విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు ఆయన అభినందించారుస్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా అధికారులు, పాల్గొన్నారు.